Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాలీవుడ్ గోల్డెన్ ఛాన్స్

Tollywood: తెలంగాణలో సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం కానుంది. సినిమా షూటింగ్‌లు, థియేటర్ల నిర్వహణ, సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులను క్రమబద్ధీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. 'Films in Telangana' పేరుతో ఒక ప్రత్యేక సింగిల్-విండో వెబ్‌సైట్‌ను రూపొందించింది. చలనచిత్ర పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల అనుమతులను కూడా దీనిద్వారా మంజూరు చేయనుంది.

తెలంగాణలో సినిమాల చిత్రీకరణకు ప్రోత్సాహం అందించడం, టాలీవుడ్ ఎదుర్కొంటోన్న సమస్యలు వంటి అంశాలపై చర్చించడానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా ఓ వర్క్ షాప్ ను ఏర్పాటు చేసింది. టీఎన్ఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు దీనికి అధ్యక్షత వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, వివిధ శాఖల సీనియర్ అధికారులు, సినీ పరిశ్రమ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

All Film making Permissions Now Just a Click Away on Films in Telangana

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడారు. తెలంగాణలో సినీ పరిశ్రమ వృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారాన్ని ఇస్తోన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సింగిల్ విండో ద్వారా సినిమాల చిత్రీకరణకు అవసరమైన అన్ని రకాల అనుమతులను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

బాలీవుడ్, హాలీవుడ్ సినీ నిర్మాతలకు కూడా ఒక వేదికగా ఈ కొత్త పోర్టల్ పనిచేస్తుందని దిల్ రాజు తెలిపారు. షూటింగ్ లొకేషన్లు, ప్రభుత్వ శాఖల అనుమతులు, సాంకేతిక నిపుణులు, ఇతర సౌకర్యాలు, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో వసతుల కల్పన, పర్యాటక రంగానికి చెందిన స్థలాలు, వాటి ఎంపికకు అవసరమైన వివరాలన్నీ కూడా ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఇలాంటి సౌకర్యం మొదటిసారిగా ప్రవేశపెట్టబోతోన్నామని దిల్‌రాజు అన్నారు.

సినిమా థియేటర్లకు తప్పనిసరి అయిన బీ-ఫారం పొందే ప్రక్రియను త్వరలో సరళీకరించి ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు- నగరాల్లో పోలీస్ కమిషనర్లు, జిల్లాల్లో అదనపు కలెక్టర్లు అనుమతులు జారీ చేసేవారని, ఈ కొత్త విధానం ప్రకారం, రాష్ట్ర హోం శాఖ ఆన్‌లైన్‌లో అనుమతులను సులభతరం చేస్తుందని దిల్ రాజు వివరించారు.

వెబ్‌సైట్ రూపకల్పన కోసం సూచనలు ఇవ్వాలని దిల్‌ రాజు సినీ పరిశ్రమ ప్రతినిధులు, ఆయా మంత్రిత్వ శాఖ అధికారులను కోరారు. పోర్టల్ ఖరారైన తర్వాత- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+