అందరినీ కలిపిన ‘అలయ్ బలయ్’..!!
తెలంగాణ ముఖ్య నేతలంతా ఒకే వేదిక మీదకు వచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఈ ఏడాది నిర్వహించారు. 4 రాష్ట్రాల గవర్నర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. తెలంగాణ సాంస్కృతిక బృందాలతో అతిథులను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక తాటికి వచ్చి కలిసి పని చేసేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నారు.
అలయ్ బలయ్ లో భాగంగా తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.. అతిథుల కోసం 150 రకాల వంటకాలు ఏర్పాటు చేసారు. అలయ్ బలయ్ స్ఫూర్తితోనే తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిందని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. కానీ అలయ్ బలయ్‌తో గవర్నర్ దత్తాత్రేయ అందర్నీ ఒక తాటిపైకి తీసుకు వచ్చారన్నారు. అలయ్ బలయ్ కార్యాక్రమం తెలంగాణ సంస్కృతిని కాపాడే మంచి కార్యక్రమం అని ఆయన అభివర్ణించారు. గత 19 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారన్నారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించటం నిజంగా అభినందనీయమనిపేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతలమంతా తరలివచ్చినట్లు రేవంత్ వెల్లడించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సమైక్యత వారధుల నిర్మాణం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. పండుగలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు సామాజిక ప్రాధాన్యత కూడా ఉందన్నారు. సమైక్యత అంటే అందరూ ఒకేమాట మీద నిలబడటమే కాదు.. ఇతరుల ఇష్టాలను సైతం గౌరవించటమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ, ఉత్తరాఖండ్ గవర్నర్, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications