అల్లు అర్జున్ రాకతో తొక్కిసలాట: మహిళ మృతి, బాలుడి పరిస్థితి విషమం (వీడియో)
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా దేశ వ్యాప్తంగా పుష్ప-2 మేనియా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 విడుదల గురువారమే అయినప్పటికీ.. తెలంగాణ సహా చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు సినిమా చూసేందుకు తరలివెళ్లారు. థియేటర్ల వద్ద భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంతోపాటు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
అయితే, ఈ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప-2 చిత్ర ప్రదర్శన బుధవారం రాత్రి ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు, అభిమాన నటుడు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు.

అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళ, ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే బాలుడికి పోలీసులు సీపీఆర్ చేశారు.
Chaos erupts at Sandhya RTC X Roads as lathi charge breaks out during the #Pushpa2 premiere.#Pushpa2TheRule #Pushpa #AlluArjun #AlluArjun𓃵 #RashmikaMandanna #sreeleela pic.twitter.com/WGoJbKy3Px
— Don Damian (@DonDamian08) December 4, 2024
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళతోపాటు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే, స్పహ కోల్పోయిన బాలుడు రేవతి కుమారురుడు శ్రీతేజ్(9)గా గుర్తించారు. ఎంతో ఆనందంగా అభిమాన నటుడి సినిమాను చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చిన వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అక్కడున్నవారినికలిచివేసింది. వారి కుటుంబంలో తీరని విషాదానని నింపింది. ఈ ఘటనల నేపథ్యంలో 200 మందికిపైగా పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో మోహరించి పరిస్థితిని పర్యేవేక్షస్తున్నారు.
అభిమానులతో కలిసి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్#Pushpa2ThaRule #PushpaTheRule #Pushpa2 #AlluArjun𓃵 #sandhya35mm pic.twitter.com/8qaCboYWt8
— Arun Nakka (@Arunnakka0) December 4, 2024
మరోవైపు, అల్లు అర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం ఆయన అభిమానులతో నిండిపోయింది. అభిమానులతో కలిసి సినిమా తిలకించారు అల్లు అర్జున్. థియేటర్లో తమతోపాటు అభిమాన నటుడు కూడా ఉండటంతో అభిమానులు పెద్ద ఎత్తున పేపర్లు చల్లుతూ ఆనందం వ్యక్తం చేశారు. కేకలు వేస్తూ సందడి చేశారు. అనంతరం అభిమానులకు ఉత్సాహపరిచి అక్కడ్నుంచి వెళ్లిపోయారు అల్లు అర్జున్. కాగా, పుష్ప-2 సినిమా ఇప్పటి వరకు వచ్చిన రివ్యూలను పరిశీలించినట్లయితే మెగా బ్లాక్ బ్లాస్టర్ అనే టాక్‌ను సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications