Allu Arjun: అల్లు అర్జున్ కు జైలా ? బెయిలా ? కాసేపట్లో నిర్ణయం..

పుష్ప2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ మృతికి కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ వ్యవహారం ఇవాళ తేలబోతోంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో దానిపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.

Allu Arjun s Bail Plea Hyderabad nampally court verdict today

సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. అయితే హైకోర్టులో తదుపరి విచారణ తర్వాత ఈ మధ్యంతర బెయిల్ కు పొడిగింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోలీసులు బెయిల్ ను గట్టిగా వ్యతిరేకించి పొడిగింపు లభించకపోతే మాత్రం అల్లు అర్జున్ కు ఇబ్బందులు తప్పవు. అందుకే ట్రయల్ కోర్టు అయిన నాంపల్లి కోర్టులో ఆయన రెగ్యులర్ బెయిల్ కోరారు.

దీనిపై ఇప్పటికే నాంపల్లి కోర్టు వాదనలు పూర్తి చేసింది. పోలీసులు కూడా అల్లు అర్జున్ బెయిల్ పై అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇందులో అల్లు అర్జున్ బెయిల్ ను పోలీసులు వ్యతిరేకించలేదు. కానీ ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. దీంతో అల్లు అర్జున్ బెయిల్ పై వాదనలు పూర్తి చేసిన నాంపల్లి కోర్టు తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. ఇవాళ అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికీ, టాలీవుడ్ కూ మధ్య దూరం పెరిగినా ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో మధ్యవర్తుల సలహాతో సీఎం రేవంత్ రెడ్డి, సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసి కూర్చుని చర్చించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం కాస్త చల్లబడినట్లు కనిపిస్తోంది. అందుకే గతంలో నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ వ్యతిరేకించిన పోలీసులు.. తాజాగా మాత్రం బెయిల్ ఇచ్చినా విచారణకు సహకరించాలా చూడమని మాత్రమే కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+