Allu Arha: 10 నిమిషాల నటనకు రూ.20 లక్షలు తీసుకోనున్న అల్లు అర్హ..! అదీ రెండో సినిమాకే..!
దేశంలో టాలీవుడ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద పెద్ద సినిమాలు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా చాలా మంది పాన్ ఇండియా స్టార్లు మారారు. అయితే ఇప్పుడు వీరి తర్వాత తరం కూడా సినిమాల్లోకి వస్తున్నారు. చిన్నప్పటి నుంచి సినిమా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున తనయ అల్లు ర్హ.. మరో సినిమాలో చేయబోతున్నారట.
అర్హ శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీలో అర్హ నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టారు. సమంత కీలక పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టినా అల్లు అర్హ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పడు అర్హ మరోసారి వెండి తెరపై కనబడపోతున్నారట. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీర్ తో దేవర అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఓ కీలకమైన పాత్ర కోసం అర్హను తీసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా చేయడానికి అర్హ భారీ పారితోషికం కూడా తీసుకోబోతున్నారట. దేవర సినిమాలో అర్హ పాత్ర పది నిమిషాలు ఉంటుందని.. దీనికి గాను రూ. 20 లక్షల పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమాలో అర్హ జాన్వీ చిన్ననాటి పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయలేదు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా వెండి తెరపై బాల నటుడిగా అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు తనయ సితారతో కలిసి అభయ్ రామ్ నటించనున్నట్లు చర్చ నడుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాలో అభయ్ రామ్ బాల నటుడిగా పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఇంట్రడక్షన్ లో అభయ్ రామ్, సితారతో కలిసి నటించిబోతునట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications