అల్లు అర్జున్ ఐకానిక్ మల్టీప్లెక్స్.. వరల్డ్ క్లాస్ ఫీచర్స్.. హైదరాబాద్ లోని ఈ ఏరియాలో..

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు స్టార్ లు గా ఎదిగి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. మరికొంత మంది బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇంకొంత మంది సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించి థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఉన్నారు. ఏఎంబీ సినిమాస్ తో మహేశ్ బాబు, అలాగే ఏఏఏ సినిమాస్ తో అల్లు అర్జున్ హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ లు ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీ ప్లెక్స్ ను ఏర్పాటు చేశారు.

అయితే ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏషియన్ గ్రూప్‌తో కలిసి థియేటర్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓ వైపు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినీ ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ థియేటర్ అనుభూతిని పంచేందుకు బన్నీ సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు 'అల్లు సినిమాస్' పేరుతో మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తో ఈ థియేటర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ థియేటర్‌ లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్.. తదితర అత్యాధునిక సాంకేతికతలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.


ఈ 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ నిర్మాణం హైదరాబాద్‌ లోని కోకాపేట- గండిపేట ప్రాంతాల మధ్య విస్తారమైన ప్రదేశంలో జరుగుతోంది. ఇక మల్టీప్లెక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద 75 అడుగుల వెడల్పు గల డాల్బీ సినిమా స్క్రీన్ ను ఏర్పాటు చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీప్లెక్స్‌ ను మార్చి 19న ఘనంగా ప్రారంభించాలని భావిస్తున్నారట.

allucinemas Icon Star Allu Arjun Epic Grand Opening on March 19 India s Largest Dolby Screen in hyd

ఇక బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ మార్చి 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ మూవీని 'అల్లు సినిమాస్' లో ప్రీమియర్‌గా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ధురంధర్ పార్ట్ 1 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+