హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబద్: హైదరాబాద్‌ కోడలిగా పిలిపించుకోవడాన్ని తాను గర్వంగా భావిస్తానని, ఈ నగరానికి ఎప్పుడు వచ్చినా వినూత్న అనుభవాలను వెంట తీసుకెళ్తుంటానని ప్రమోద్ మహాజన్ కూతురు, పార్లమెంటు సభ్యురాలు పూనమ్ మహాజన్ అన్నారు. తనక పెళ్లయి 15-16 ఏళ్లు అయి ఉంటుందని, అప్పట్లో మహారాష్ట్రలో హైదరాబాదీ బహు అని అనేవాళ్లు కానీ ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఆ మాట వింటున్నానని ఆమె అన్నారు.

'యాస్పైర్‌ టూ ఇన్‌స్పైర్‌' శీర్షికన శుక్రవారం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాదులోని బంజారా హిల్స్‌లో గల పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన ఈ టాక్‌ షోలో ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ పద్మా రాజగోపాల్‌తో పాటుగా ఎన్‌డీటీవీకి జర్నలిస్ట్‌ మాయా శర్మతో కలిసి పాల్గొన్నారు.

తాను మూడు ప్రాంతాలకు చెందినదాన్నని పూనమ్ మహాజన్ అన్నారు. తాను పుట్టింది మహారాష్ట్రలో గానీ పెళ్లాడింది తెలంగాణ, వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లని అని చెప్పారు. తమ పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాబట్టి తాను ఆంధ్రా అమ్మాయిని కూడా అని అన్నారు.

జన్యుపరంగా చూసుకుంటే తాను తెలుగమ్మాయినే అని చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని గానీ వస్తానని గానీ ఎప్పుడూ అనుకోలేదని, అలా జరిగిందంతేనని అన్నారు. తన తండ్రిని షూట్‌ చేసినప్పుడు తాము అక్కడే ఉన్నామని, వెంటనే ఆయన్ని 15 వ ఫ్లోర్‌లోని మా అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు తీసుకువచ్చేటప్పుడు, ఆయనకు ధైర్యం చెబుతూ మీరు బాధపడొద్దు. ఇప్పుడు మొదలవుతుందని తాను అన్నట్లు చెప్పారు.

నా ఉద్దేశం వేరే కానీ...

నా ఉద్దేశం వేరే కానీ...

తన తండ్రి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందనే భావనతో తాను అన్నాను గానీ తన జీవితంలో కొత్త అధ్యాయం అప్పుడే మొదలైందని అన్నారు. తమ తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో సంఘటనలు జరిగాయని చెప్పారు. ఆ పరిస్థితుల్లో తమ బాబాయ్‌ సహా అందరూ రాజకీ యాల్లోకి తనకు చెప్పారని అన్నారు.

ఓడిపోయా, కానీ....

ఓడిపోయా, కానీ....

తనకు అసలు రాజకీయాల మీద అవగాహన లేదని, తొలుత విధాన సభకు పోటీ చేశానని, 35వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని, జీవితం ఇక అయిపోయిందనుకున్నాను గానీ నెవర్‌గివప్‌ అనే యాటి ట్యూడ్‌ ముందుకు నడిపించిందని చెప్పారు.

ఓడిపోతానని అన్నారు...

ఓడిపోతానని అన్నారు...

2014 ఎన్నికల్లో ముంబై నార్త్‌ సెంట్రల్‌ నుంచి పోటీ చేయాలన్నప్పుడు అందరూ తాను ఓడిపోతానని అన్నారని కానీ యంగెస్ట్‌ పార్ల మెంటేరియన్‌గా లోక్‌సభ సెంట్రల్‌హాల్లో అడుగుపెట్టానని పూనమ్ మహాజన్ చెప్పారు.

అందంగా కనిపించాలని..

అందంగా కనిపించాలని..

అందంగా కనిపించాలని, అంతకన్నా ఎక్కువగా తమ ఇంటిల్లిపాదికీ వండి వడ్డించాలని ఉంటుందని, కానీ తాను వండుతానంటే తమ వారంతా రెస్టారెంట్‌కు వెళ్దామంటారని చెప్పారు. మేనకా గాంధీతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

జన్యుపరంగా చూసుకుంటే తాను తెలుగమ్మాయినే అని చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని గానీ వస్తానని గానీ ఎప్పుడూ అనుకోలేదని, అలా జరిగిందంతేనని అన్నారు. తన తండ్రిని షూట్‌ చేసినప్పుడు తాము అక్కడే ఉన్నామని, వెంటనే ఆయన్ని 15 వ ఫ్లోర్‌లోని మా అపార్ట్‌మెంట్‌ నుంచి కిందకు తీసుకువచ్చేటప్పుడు, ఆయనకు ధైర్యం చెబుతూ మీరు బాధపడొద్దు. ఇప్పుడు మొదలవుతుందని తాను అన్నట్లు చెప్పారు.

 ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

తాను మూడు ప్రాంతాలకు చెందినదాన్నని పూనమ్ మహాజన్ అన్నారు. తాను పుట్టింది మహారాష్ట్రలో గానీ పెళ్లాడింది తెలంగాణ, వ్యాపారవేత్త ఆనంద్‌రావు వాజెండ్లని అని చెప్పారు.

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

తమ పూర్వీకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాబట్టి తాను ఆంధ్రా అమ్మాయిని కూడా అని అన్నారు.

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

ఆంధ్ర అమ్మాయిని, హైదరాబాద్ కోడలిగా గర్వం: పూనమ్ మహాజన్

‘యాస్పైర్‌ టూ ఇన్‌స్పైర్‌' శీర్షికన శుక్రవారం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

English summary
Pramod Mahajan's daughter and MP Poonam Mahajan said that she is proud being the daughter -in- law of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X