హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమేజాన్, దటీజ్ హైదరాబాద్!: కేటీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదు భౌగోళికంగా అనువుగా ఉన్న ప్రదేశం కావడంతో ఇక్కడ నుండి దేశ, విదేశాలకు ఉన్న రవాణా సౌకర్యాలు అమేజాన్ లాంటి కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు.

హైదరాబాదు సమీపంలోని కొత్తూరు వద్ద అమేజాన్ సంస్థ అతిపెద్ద ఫుల్ ఫిల్ మెంట్ సెంటరును ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. అమెజాన్ సంస్థకు 11 రోజుల్లో అనుమతులు ఇచ్చినట్లు ఆ సంస్థకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఐపాస్ ద్వారా ప్రాజెక్టులకు మూడు వారాల్లో కేవలం సొంత ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు కేసీఆర్ అందులో వివరించారు. పెట్టుబడులకు స్నేహపూర్వక రాష్ట్రంగా తెలంగాణను చేస్తామన్నారు.

అమేజాన్

అమేజాన్

తెలంగాణ పైన అమేజాన్ సంస్థ చూపిన నమ్మకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందించారు. బుధవారం కసచివాలయంలో కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమక్షంలో అమేజాన్ సీనియర్ ఉపాధ్యక్షులు డేవ్ క్లార్క్, సంస్థ భారత మేనేజర్ అమిత్ అగర్వాల్‌ల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.

 అమేజాన్

అమేజాన్

హైదరాబాదు భౌగోళికంగా అనువుగా ఉన్న ప్రదేశం కావడంతో ఇక్కడ నుండి దేశ, విదేశాలకు ఉన్న రవాణా సౌకర్యాలు అమేజాన్ లాంటి కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు.

 అమేజాన్

అమేజాన్

అమేజాన్ లాంటి సంస్థ అతిపెద్ద గిడ్డంగి సంస్థను ఏర్పాటు చేయడం హైదరాబాదు అనువు అనేందుకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.

 అమేజాన్

అమేజాన్

అమెజాన్ లాంటి సంస్థలు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కొత్తతరం వ్యాపారాలకు, కొత్త అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని కేటీఆర్ అన్నారు.

అమేజాన్

అమేజాన్

అమేజాన్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు డేవ్ క్లార్క్ మాట్లాడుతూ.. 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగి ఏర్పాటుతో వేగంగా సేవలు అందించగలమన్నారు. వేలాది మంది చిరు వ్యాపారులకు అవకాశం కలుగుతుందని, ఉత్పత్తులను అమేజాన్ ద్వారా అమ్ముకోవచ్చునని చెప్పారు.

అమేజాన్

అమేజాన్

ఈ కామర్స్ ద్వారా వస్తువులను అమ్ముకునేందుకు ముందుకు వచ్చే వ్యాపారులకు శిక్షణ, అవగాహన తప్పనిసరి అన్నారు.

English summary
E-Commerce major Amazon has chosen Telangana over the neighbouring state of Karnataka to set up its largest fulfilment centre (FC) in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X