చిట్టీల పేరుతో మోసం: టీవీ నటి విజయరాణి ఆస్తుల జప్తు
హైదరాబాద్: చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడిన టీవీ నటి విజయ రాణి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అటాచ్ చేసింది. ఆస్తులను జప్తు చేస్తూ హోంశాఖ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిట్టీల పేరుతో జూనియర్ ఆర్టిసులను మోసం చేసిన టీవీ నటి విజయరాణిని హైదరాబాద్ నగర నేరపరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులు నిరుడు ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
చిట్టీల పేరుతో విజయరాణి 4 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్లు పోలీసాఫీసర్ పాలరాజు అప్పట్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మీడియా సమావేశంలో విజయరాణి ఏడ్చేశారు. తాను ఎవరినీ మోసం చేయలేదని విజయరాణి మీడియా ప్రతినిధులతో అన్నారు. కోటి రూపాయల వరకు తనకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని, తాను ఇవ్వాల్సిన డబ్బులు కూడా అంతే ఉంటాయని ఆమె చెప్పారు. అసలుకు నాలుగింతలు వడ్డీ చెల్లించానని ఆమె చెప్పారు.
అస్తులు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని, లేకుంటే చంపేస్తామని బెదిరించారని, దానివల్లనే తాను పారిపోయానని ఆమె చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులను మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బుల వివరాలను, తాను చెల్లించాల్సిన డబ్బుల వివరాలను తాను పోలీసులకు ఇచ్చినట్లు విజయరాణి తెలిపారు.

తన వద్ద తినడానికి కూడా డబ్బులు లేవని, తన వద్ద డబ్బులు లేకపోతే పోలీసులే తిండి పెట్టారని ఆమె చెప్పారు. విజయరాణి అధిక వడ్డీలు ఆశచూపి నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఆమె 3 నుంచి 20 శాతం వరకు కూడా వడ్డీలు చెల్లించి అప్పులు తీసుకుందని, అధిక వడ్డీలు తీసుకున్నవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
విజయరాణికి చెందిన హైదరాబాదు, గుడివాడల్లోని ఆస్తులను, ఓ కారును, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయరాణితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టయినవారిలో ఆమె చెల్లెలు, కుమారుడు, కోడలు కూడా ఉన్నట్లు చెప్పారు. విజయరాణి బంధువులను కూడా ప్రశ్నించినట్లు తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications