వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమిత్ షా కేరాఫ్ తెలంగాణ: టార్గెట్ టీఆర్ఎస్ - రోడ్ మ్యాప్ రెడీ : ర్యాలీలు - సభలు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పైన బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పైన రాజకీయ యుద్దం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించుతామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా.. వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దిశగా బీజేపీ రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది.

ప్రతీ నెలా షా తెలంగాణ పర్యటన

ప్రతీ నెలా షా తెలంగాణ పర్యటన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు సిద్దమయ్యారు. అందుకోసం ప్రతీ నెలా రెండు రోజుల పాటు తెలంగాణలో మకాం వేసేలా నిర్ణయం జరిగింది. ఇక, ఆరెస్సెస్ ప్రముఖ నేత ఒకరు సైతం ఇక పూర్తిగా తెలంగాణలోనే ఉండేలా నిర్ణయం జరిగిందని సమాచారం. ఈ నెలాఖరాలోగా షా రాష్ట్ర పర్యటన ఉంటుందని.. పూర్తి స్థాయిలో ఆ పర్యటన సమయంలో ఫైనల్ అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ వ్యవహారాల పైన ప్రధాని సైతం ఎప్పటిప్పుడు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు జాతీయ నాయకత్వం స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు.

ప్రతీ జిల్లా కేంద్రంలో సభలు

ప్రతీ జిల్లా కేంద్రంలో సభలు

వచ్చే నెల 2 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలో ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగింపు సభ వరంగల్ లో నిర్వహించాలని పార్టీ ని్ణయించింది. ఆ సభకు అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సంజయ్‌ పాదయాత్రతోపాటు రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా బైక్‌ ర్యాలీలు చేపట్టాలంటూ గతంలోనే షా రాష్ట్ర పార్టీని ఆదేశించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల బైక్‌ ర్యాలీలను రాష్ట్ర పార్టీ ప్రారంభించింది.

జాతీయ నేతల వరుస పర్యటనలు

జాతీయ నేతల వరుస పర్యటనలు

తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ నియోజవకర్గాల వారీగా సమీక్ష చేసుకొని.. జిల్లాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందు కోసం జాతీయ నేతలు సైతం తరచూ తెలంగాణలో పర్యటించేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అమిత్ షా ప్రతి నెలా ఒక్కో జిల్లా కేంద్రంలో జరిగే సభలో పాల్గొంటారని.. రోడ్ షో లు సైతం ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత పూర్తిగా తెలంగాణ పైనే జాతీయ నాయకత్వం ఫోకస్ ఉంచే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర నేతలు చెప్పుకొస్తున్నారు.

English summary
Union Home Minister Amit Shah decided to focus on Telangana, visit every month and stay for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X