ఆమ్రపాలి ప్రేమ పెళ్లి వచ్చే నెలలోనే: వరుడు ఎవరో తెలుసా?
Recommended Video

వరంగల్/హైదరాబాద్: వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారిని ఆమ్రపాలి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.
ప్రస్తుతం ఆమె రూరల్ జిల్లాకు కూడా ఇంఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివాహ విషయంపై ఆమ్రపాలి ఇప్పటికే ధ్రువీకరించారు.

జూనియర్‍తో ప్రేమ పెళ్లి..
2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి.. సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఢిల్లీకి చెందిన సమీర్ 2011లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

ఫిబ్రవరిలో పెళ్లి..
విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమె.. ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు. వివాహం నేపథ్యంలో జనవరి 27 నుంచి ఆమ్రపాలి సెలవులో వెళ్తున్నట్లు తెలిసింది.

చిన్నతనం నుంచీ చురుగ్గానే..
ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

వరంగల్ కలెక్టర్గా..
2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఆమెను వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా నియమించింది.

యంగ్ అండ్ డైనమిక్
యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలి.. టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. యువతకు దగ్గరయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications