TRS: తెలంగాణలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్‍కు ఇబ్బందేనా..!
తెలంగాణ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ పార్టీ రానుంది. ఏంటీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాదా.. అని మీరు అనవచ్చు. అవును మీరు చెప్పింది నిజమే కానీ.. కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. మారి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ను ఎలా ఇబ్బంది పెడుతుందో ఆసక్తిగా మారింది. ఇంతకీ టీఆర్ఎస్ అంటో చెప్పలేదు కాదూ.. తెలంగాణ రాజ్య సమితి(TRS). ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంది.
సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఫిబ్రవరి 13న ఆయన తన పార్టీ ఇంగ్లీష్ లో టీఆర్ఎస్ అని వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. తమ పార్టీకి గుర్తింపు ఇవ్వాలని కోరారు. బాలరంగం దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించింది. కొత్త పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపాలని కోరింది. ఇందుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది.

ఇందుకు సంబంధించి తెలంగాణ రాజ్య సమితి నిర్వాహకులు ఫోర్త్ వాయిస్ అనే పత్రికలో ఆంగ్లంలో పత్రికలో మార్చి 29న ప్రకటన ఇవ్వగా.. మార్చి 28న హిందీ భాష పేపర్ లో ప్రకటన ఇచ్చినట్లు సీఈసీ తెలిపింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 26న విడుదల చేసిన నోటీసు ప్రకారం మే నెల 27 వరకు తెలపొచ్చు. అప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు కమిషన్‌కు వెళ్తాయన్నది చూడాలి.
తెలంగాణ రాజ్య సమితి పార్టీ కార్యాలయంగా ఓల్డ్ అల్వాల్ ఇం. నెం. 1-4-177/148, 149/201 చిరునామాతో దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సదుపల్లి రాజు ఉ్ననారు. చూడాలి వీరి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలుపుతుందో లేదో..












Click it and Unblock the Notifications