మాయమాటలతో మైనర్ బాలికతో పెళ్లికి యత్నం: అరబ్ షేక్ అరెస్ట్
హైదరాబాద్: పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి, పెళ్లి పేరుతో అరబ్ షేక్‌లు బాలికలను మోసం చేస్తున్న మరో ఘటన పాతబస్తీలో వెలుగు చూసింది. పాతబస్తీలో ఓ మైనర్ బాలికను వివాహమాడేందుకు యత్నించిన అరబ్‌షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఉమాన్ దేశానికి చెందిన బదర్ యూసుఫ్ అల్ బ్లూషీ(37) అనే వ్యక్తి జులై నెల 18న హైదరాబాద్‌కు వచ్చాడు. పాతబస్తీలోని ఫత్తర్ క మకాన్ సమీపంలో 17 ఏళ్ల బాలికతో సోమవారం వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
మరికొన్ని గంటల్లో వివాహం జరుగుతుందనగా సమాచారం అందుకున్న రెయిన్ బజార్ పోలీసులు అక్కడికి చేరుకుని వివాహాన్ని నిలిపివేశారు. మైనర్‌ను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన అరబ్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications