భగ్న ప్రేమికుడి ఆత్మహత్య‌: ఐ హేట్ గర్ల్స్ అంటూ గోడపై సూసైడ్ నోట్

హైదరాబాద్: ‘అమ్మాయిని ప్రేమించినంత తప్పు జీవితంలో మరొకటి లేదు. మీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే జాగ్రత్త. వాళ్లు చాలా క్లోజ్‌గా ఉన్నారనుకున్నారో.. నట్టేట ముంచేస్తారంటూ తరచూ స్నేహితులతో చెప్పేవాడు. ‘ఐ హేట్‌ గర్ల్స్‌' అంటూ బోరున విలపించేవాడు. ప్రేమించిన యువతికి పెళ్లికావటంతో జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అదే గ్రామానికి చెందిన గల్లా సుధీర్‌కుమార్‌(24) బీటెక్‌ పూర్తి చేశాడు. చదువుకునే సమయంలోనే ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఆరు నెలల క్రితం ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి.

An youth from prakasam district Sudhir Kumar commited suicide

ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల క్రితం వేరే యువకుడితో పెళ్లయింది. దాన్నుంచి బయటపడేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చాడు. కొంతకాలంగా స్నేహితులతో కలిసి నిజాంపేటలోని కేటీఆర్‌నగర్‌ ఎస్‌వీపీ రెసిడెన్సీలోని నాలుగో అంతస్థులో నివసిస్తున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తీవ్ర మనోవేదనతో నిత్యం తాను ప్రేమించిన యువతి గురించి స్నేహితులతో చెప్పేవాడు. తరచూ అమ్మాయిలను ద్వేషిస్తూ మాట్లాడేవాడు.

ఆదివారం రాత్రి ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి సుధీర్‌ మద్యం తాగాడు. ఆ తర్వాత టవల్‌తో కిటికీ చువ్వకి ఉరేసుకున్నాడు. ఉదయాన్నే నిద్రలేచిన స్నేహితులు సుధీర్‌ ఆత్మహత్య విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

‘నేను మంచి చెబితే వినలేదు. తను అబద్ధం చెప్పింది. నన్ను బాడ్‌ చేసింది. నా చావుకి తనే కారణం. సారీ ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీ, రిలేటివ్స్‌'... అని అతడు ఆత్మహత్య చేసుకునే ముందు గోడ మీద తన మరణ వాగ్మూలం రాశాడు. ‘ఐ హేట్‌ గర్ల్స్‌' అంటూ గోడమీద సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+