Udaya Bhanu పొలిటికల్ ఎంట్రీ.. యుద్ధం చేస్తానంటూ సంచలన ప్రకటన

బుల్లితెరపై తన మార్క్ యాంకరింగ్‌తో సుదీర్ఘకాలం పాటు ప్రేక్షకుల మనసులను ఏలిన గ్లామరస్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె వైఖరి చాలామందికి ఇష్టం. అయితే సాధారణంగా సినీ రంగానికి చెందిన నటీనటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇదే క్రమంలో ఉదయభాను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు కొద్దిరోజులుగా షికారు చేస్తున్న వేళ, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఆఫర్ల వెనుక ఉన్న నిజాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రూ. 100 కోట్లు ఉంటేనే టికెట్.. మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్!

రాజకీయాల్లోకి రాకముందే తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఉదయభాను బయటపెట్టారు. గతంలోనే ఓ ప్రముఖ రాజకీయ పార్టీ నుంచి తనకు పిలుపు వచ్చిందని, కోరిన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పారని వెల్లడించారు. అయితే ఆ ఆఫర్ వెనుక ఓ ఊహించని షరతు పెట్టారట. సీట్ కావాలంటే కనీసం రూ. 100 కోట్లు దగ్గర ఉంచుకోవాలని, ఆ మొత్తాన్ని ఎన్నికల తర్వాత ఏడాదిన్నరలోనే మళ్లీ సంపాదించుకోవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చారట. ఆ నంబర్ వినగానే తనకు మైండ్ బ్లాక్ అయిందని, అంత పెద్దమొత్తం తన దగ్గర లేదని స్పష్టం చేసినట్లు ఉదయభాను తెలిపారు.

Anchor Udaya Bhanu Reveals Secrets Offered MLA Seat for 100 Crores Plans Independent Entry Soon
వేణుమాధవ్‌ చివరి మాటలివే.. వాళ్లను నమ్మొద్దంటూ.. ఉదయభాను ఎమోషనల్
వేణుమాధవ్‌ చివరి మాటలివే.. వాళ్లను నమ్మొద్దంటూ.. ఉదయభాను ఎమోషనల్

నిజాయితీగా పనిచేస్తా కానీ.. ఆ పార్టీ పేరు సీక్రెట్!

100 కోట్ల రూపాయలు అనేది ఎమ్మెల్యే టికెట్‌కు కేవలం బేసిక్ అర్హత మాత్రమేనని చెప్పడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుతో కూడుకున్న రాజకీయాలు చేయడం కంటే ప్రజాసేవ ముఖ్యమని నమ్మే తాను, ఆ ఆఫర్‌ను వినయపూర్వకంగా తిరస్కరించానని చెప్పారు. రూపాయి ఆశించకుండా నిజాయితీగా ఏ నియోజకవర్గంలోనైనా పార్టీ తరపున ప్రచారం చేస్తానని కోరినా వారు అంగీకరించలేదని గుర్తుచేసుకున్నారు. అయితే తనను అంత మాట అన్న ఆ రాజకీయ పార్టీ ఏది అనే వివరాలను మాత్రం ఆమె బయటకు చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు.

అతనితో అలా చేసి తప్పు చేశా - ఉదయ కిరణ్ హీరోయిన్
అతనితో అలా చేసి తప్పు చేశా - ఉదయ కిరణ్ హీరోయిన్

ఇండిపెండెంట్‌గా 'యుద్ధం' చేస్తా: భవిష్యత్ ప్లాన్ ఇదే!

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఏ పార్టీ నీడన నిలబడబోనని ఉదయభాను స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి సమాజ మార్పు కోసం పోరాటం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే కొత్త రక్తం, కొత్త ఆలోచనలు ఉన్న నాయకులు ముందుకు రాక తప్పదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సినీ రంగంలో కొనసాగుతున్న ఉదయభాను, రేపటి రోజున ఇండిపెండెంట్ లీడర్‌గా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి తనదైన శైలిలో 'యుద్ధం' చేస్తారా లేక కెరీర్‌పైనే దృష్టి పెడతారా అనేది కాలమే నిర్ణయించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+