Bigg Boss Telugu 5: కంటెస్టెంట్లుగా డార్జిలింగ్ డాల్..టాటూ పార్లర్ ఓనర్

హైదరాబాద్: ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5.. ఈ సారి కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఫుల్ గ్లామరస్‌గా టీవీ వీక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి తెలుగు గడపనూ పలకరిస్తోంది. ఎప్పట్లాగే అక్కినేని అందగాడు నాగార్జున.. హోస్ట్‌గా అదరగొడుతున్నాడు. ఫస్ట్ లుక్‌లోనే ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. సీజన్ 5 కంటెస్టెంట్లను పరిచేయం చేశాడు. తొలి కంటెస్టెంట్‌గా సిరి హనుమంతు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత వరుసగా ఫిల్మ్ అండ్ టీవీ నటీనటులు వీజే సన్నీ, లహరి షారీ, ఇండియన్ ఐడల్ విన్నర్, టాప్ సింగర్ శ్రీరామచంద్ర బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా హౌస్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు. అనంతరం లోబో తనదైన మార్క్‌ను చూపించారు. లోబో (Lobo) అసలు పేరు మహ్మద్ ఖయ్యుం. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో కనిపించాడీ యాంకర్ కమ్ యాక్టర్. ఇదివరకు నేచురల్ స్టార్ నాని నటించిన పైసా మూవీలో కనిపించాడు. నాని స్నేహితుల్లో ఒకడిగా నటించాడు. ఆ క్యారెక్టర్ అతని సినీ జర్నీకి పెద్దగా బెనిఫిట్ కాలేదు.

Anee Master Bigg Boss Telugu 5 Contestant: Everything You Need To Know About Darjeeling dancer

దీనితో అతను బుల్లితెరపైనే సెటిల్ అయ్యాడు. తనకు ఉన్న పరిచయాలను అతను వ్యాపారపరంగా బదలాయించుకున్నాడు. హైదరాబాద్‌లో ఓ టాటూ పార్లర్‌ను సొంతంగా నడిపిస్తున్నాడు లోబో. ఇదివరకు ఓ సారి వివాదాస్పద రీతిలో లోబో వార్తల్లోకి ఎక్కాడు. 2014లో అతను ఓ సారి అరెస్ట్ కూడా అయ్యాడు. ఓ టీచర్‌ను దుర్భాషలాడిన కేసులో అతణ్ని బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నాడు.

కాగా.. అయిదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన అనీ మాస్టర్ (Anee Master) డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్. ఆమె స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆమెకు అయిదేళ్ల వయస్సులోనే తండ్రి మరణించారు. ఏడేళ్ల ప్రాయంలోనే కుటుంబాన్ని మోయాల్సిన బాధ్యత ఆమె మీద పడింది. దీనితో డాన్స్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్నారు. పదో తరగతితోనే తన చదువును ఆపివేశారు. టాప్ డాన్సర్ కమ్ యాక్టర్.. ప్రభుదేవాను ఆదర్శంగా తీసుకున్నారు.

Anee Master Bigg Boss Telugu 5 Contestant: Everything You Need To Know About Darjeeling dancer

Recommended Video

    పోలీసుల అక్రమకేసులకు భయపడేది లేదంటున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు || Oneindia Telugu

    ప్రభుదేవా న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన కబూమ్ డాన్స్ షోలో అనీ మాస్టర్ ఫైనలిస్ట్. శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో కో డాన్సర్‌గా పని చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ మూవీతో ఇండిపెండెంట్‌గా కోరియోగ్రాఫర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. డాన్స్ షో ఢీకి ఆమె కో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్నారు. శేఖర్ మాస్టర్, ప్రియమణితో కలిసి న్యాయనిర్ణేతగా ఉంటోన్నారు అనీ మాస్టర్. ఇక బిగ్‌బాస్‌తో తెలుగింటిని పలకరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+