మహిళలను అక్కడ అసభ్యంగా తాకి, మహిళ పోలీసుల నిఘాతో టెక్కీ అరెస్ట్
హైదరాబాద్: టెక్కీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు.అయితే తాను ఎవరో తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. అయితే పోలీసులు వలపన్ని నిందితుడిని పట్టుకొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఆ నిందితుడు మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.
ఉన్నత విద్యాభ్యాసం చేసినా మనిషి వ్యక్తిత్వం మార్పు లేకపోతే ప్రయోజనం ఉండదని మరోసారి నిరూపితమైంది. విదేశాల్లో ఉద్యోగం చేసిన వచ్చిన అనిరుధ్ అనే వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
మహిళలు సంచరించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు అనిరుధ్. అయితే ఈ విషయమై నిందితుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

మహిళల పట్ల అసభ్యంగా
సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో నివాసం ఉంటున్న అనిరుధ్ అనే వ్యక్తి గచ్చిభౌలిలోని ఓ బహుళజాతి సంస్థలో బీపీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాద్ నుండి నిత్యం గచ్చిభౌలికి మోటార్‌బైక్‌పై వెళ్ళేవాడు. గచ్చిభౌలికి వెళ్ళే మార్గమధ్యలో మహిళలు ఒంటరిగా కన్పిస్తే వారిని వెనుక నుండి అసభ్యంగా తాకుతూ పారిపోయేవాడు. తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకొనేవాడు.

ఆ ప్రదేశంలోనే మహిళలను తాకేవాడు
ఎమ్మెల్సీ బయో టెక్నాలజీ చదివిన అనిరుధ్ కొంతకాలం పాటు స్కాట్లాండ్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత స్కాట్లాండ్ నుండి హైద్రాబాద్‌కు తిరిగివచ్చాడు గచ్చిభౌలిలోని బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు ప్రతి రోజూ బైకు మీద విధి నిర్వహణకు వెళ్ళేవాడు. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ మార్గంలో మహిళలు ఒంటరిగా వాకింగ్ వచ్చినట్టు కన్పిస్తే వారిని వెనుక నుండి పిరుదులపై బలంగా కొట్టి పారిపోయేవాడు.

పోలీసులకు ఫిర్యాదులు
గచ్చి బౌలికి వెళ్ళే మార్గంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న జీపీఆర్‌ఏ క్వార్టర్స్ రోడ్డులో, మార్చి 12న ఇంద్రానగర్ వద్ద, 14న వినాయక్‌నగర్ వద్ద మహిళలతో అనిరుధ్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

వల వేసి పట్టుకొన్న పోలీసులు
అనిరుధ్‌ను పట్టుకొనేందుకు పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. ప్రత్యేక బృందాల,ను రంగంలోకి దించారు. కొద్ది రోజులు మహిళా పోలీసులూ ఉదయం నడకకు వెళ్లారు. చివరికి బాధితులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం అతని బైక్ రంగు, హెల్మెట్‌రంగు ఆధారంగా సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు. నిందితుడు పనిచేసే కంపెనీని గుర్తించారు. నిఘా పెట్టి శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications