కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టుపట్టించారు: శ్రీలంకతో పోలుస్తూ అన్నామలై సంచలనం

హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. తెలంగాణలో కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీ... కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని, ఓ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ లేదా ఒక కుటుంబం చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదన్నారు.

శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైందని అన్నామలై అన్నారు.
కేసీఆర్ అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. విభజన తర్వాత కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదన్నారు.

Annamalai hits out at kcr govt in telangana election campaign

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు అన్నామలై. ఎనిమిది కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే.. 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రూ.6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని ఆయన ధ్వజమెత్తారు. దేశమంతా ఇప్పుడు నరేంద్ర మోడీ మోడల్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్‌గా మారిందని అన్నామలై విమర్శించారు. బీజేపీ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అయితే బీఆర్ఎస్‌కు మజ్లిస్ బీ టీమ్ అని అన్నామలై ఆరోపించారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన రైతు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు.

మంగళవారం ఆయన తెలంగాణలోని శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ... శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీఇండియాగా ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే ఉదేశ్యంతో పార్టీ అధిష్ఠానం రవికుమార్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చిందన్నారు. ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+