ఇప్పటికే 10మందితో!: 11వ సారి పెళ్లికి సిద్దపడి పట్టుబడ్డాడు.. మరో షేక్ బాగోతం!
ఇప్పటికే ఏకంగా పదిమంది యువతుల్ని వివాహం చేసుకున్న ఆ షేక్.. పదకొండో వివాహానికి సిద్దమయ్యాడు.
హైదరాబాద్: పాతబస్తీ పేద, అమాయక ముస్లిం కుటుంబాలను టార్గెట్‌గా చేసుకుని నిఖా పేరుతో అరబ్ షేక్‌లు సాగిస్తున్న దుర్మార్గాన్ని హైదరాబాద్ పోలీసులు బయటపెట్టిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితం జరిపిన దాడుల్లో ఐదుగురు దుబాయ్ షేక్ లు, ఐదుగురు యెమన్ దేశస్తులతో పాటు వారికి వివాహాలు జరిపించిన ఖాజీలు, బ్రోకర్లను అరెస్టు చేసి వారిని విచారిస్తున్నారు.

తాజాగా సోమవారం రాత్రి జరిపిన దాడుల్లో మరో అరబ్ షేక్ బాగోతం బయటపడింది. ఇప్పటికే ఏకంగా పదిమంది యువతుల్ని వివాహం చేసుకున్న ఆ షేక్.. పదకొండో వివాహానికి సిద్దమయ్యాడని తెలిసి పోలీసులే షాక్ తిన్నారు. గతంలో చేసుకున్న పది పెళ్లిళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై దుబాయ్ ఎంబసీతో మాట్లాడి అతనిని వెనక్కి పంపనున్నట్టు డీసీపీ సత్యానారాయణ తెలిపారు. వయసు మళ్లిన ఆ వ్యక్తి క్రానిక్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. నిషేధిత మందులు కూడా ఆయన వద్ద గుర్తించామని, దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆయనతో పాటు మరొక షేక్ ను, యెమన్ దేశీయులను, కాంట్రాక్ట్ మేరేజ్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి వివాహల కోసం ఇండియాలో అడుగుపెట్టాలంటే భయపడేలా చేస్తామని డీసీపీ హెచ్చరించారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications