డ్రగ్స్ కేసులో మరో కీలక అరెస్ట్: సిట్ ముందుకు ముసుగు వ్యక్తి.. చార్మి చెప్పిందనే?
కెల్విన్ బయటపెట్టిన వివరాల మేరకు నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కమింగాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో కీలక వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కాసేపటి క్రితం ధ్రువీకరించారు. కెల్విన్ బయటపెట్టిన వివరాల మేరకు నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కమింగాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బుధవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు.
నెదర్లాండ్స్ నుంచి ఇండియాకు మైక్ కమింగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. 2018వరకు అతని వీసా గడువు ఉన్నట్లుగా గుర్తించారు. చాలాకాలంగా అతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెబుతున్నారు.
నిజానికి మంగళవారం రాత్రే అతని అరెస్టు జరిగిందని, బుధవారం అతన్ని కోర్టులో ప్రవేశపెడుతున్నామని సబర్వాల్ చెప్పినట్లు తెలుస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడంలో ఇతనిదే కీలక పాత్ర అని సమాచారం.

ఇదిలా ఉంటే, చార్మి విచారణ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు పిలిపించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముసుగు ధరించిన ఓ వ్యక్తి సాయంత్రం సమయంలో లోపలికెళ్లినట్లు చెబుతున్నారు. చార్మి వెల్లడించిన వివరాల మేరకే.. అతన్ని సిట్ ముందుకు తీసుకొచ్చినట్లు సమాచారం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications