ఖాకీ వడ్డీల దందా: మోహన్‌ రెడ్డిపై కేసుల మీద కేసులు

కరీంనగర్ : అక్రమ వడ్డీ వ్యాపారం చేశాడనే ఆరోపణలపై అరెస్టయిన కరీంనగర్ ఎఎస్సై మోహన్ రెడ్డి బాధితులు ఒక్కొరొక్కరే బయటకు వస్తున్నారు. దీంతో ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి.

ఆస్తులను తనఖా పెట్టి అప్పు తీర్చి నా వాటిని స్వాధీనం చేసుకుని మోసం చేశాడంటూ మోహన్‌రెడ్డిపై కరీంనగర్‌లోని సాయినగర్‌కు చెందిన తంగెళ్ల మణెమ్మ ఎస్పీకి ఫిర్యాదు చే సింది. తన ఇంటిని కుదువ పెట్టి రూ.17లక్షలు అప్పు తీసుకుని రూ.17.30 లక్షలు చెల్లించినట్లు తెలిపింది. అయినా ఆయన అనుచరులు తుపాకులతో బెదిరించి ఇంటి నుంచి గెంటేస్తే హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేసింది.

ఇదిలావుంటే, ఆయనపై సోమవారం మరో కేసు నమోదైంది. కరీంనగర్ ముకరంపురలోని వెంకటేశ్వర లాడ్జి యజమాని సోమ సురేష్ 2011 మార్చి 31వ తేదీన మోహన్ రెడ్డి వద్ద 25 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. ముకరంపురలోని తన ఇంటిని అందుకు మోహన్ రెడ్డి పేర జిపి చేశాడు. వడ్డీ కింద ఇప్పటి వరకు 52.95 లక్షలు చెల్లించాడు.

Another case booked on ASI Mohan Reddy

కాగా అంతకు ముందే శ్రీరాం సిటీ యూనియన్ బ్యాంకులో సురేష్ 15 లక్షల రూపాయలు అప్పు తీసుకుని సెక్యూరిటీ కింద వెంకటేశ్వర లాడ్జి డాక్యుమెంట్స్ పెట్టాడు. అయితే ఓ రోజు మోహన్ రెడ్డితో పాటు అతని అనుచరులు సోమ సురేష్ ఇంటికి వెళ్లి తుపాకులతో బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు.

ఆ తర్వాత చూసేసరికి లాడ్జితో పాటు ముకురంపురాలోని ఇల్లు ఆదిరెడ్డి అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+