హైదరాబాద్‌లో మరో డ్రగ్ బాంబు:పవర్‌ఫుల్ సరుకుతో పట్టుబడ్డ ముఠా..
ఇటీవల పట్టుబడిన డ్రగ్ మాఫియా కంటే ఇప్పుడు పట్టుబడిన వారి వద్ద మరింత పవర్ ఫుల్ డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ప్రముఖులతో పాటు పలువురు కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల పట్టుబడిన డ్రగ్ మాఫియా కంటే ఇప్పుడు పట్టుబడిన వారి వద్ద మరింత పవర్ ఫుల్ డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది.
పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద వీరు డ్రగ్స్ విక్రయిస్తున్న క్రమంలో ఎక్సైజ్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఆ హోటల్‌కు పక్కనే ఉన్న ఓ అపార్ట్ మెంటులో ఈ ముఠా సభ్యుడు ఒకరు నివాసముంటున్నట్లు గుర్తించారు. హోటల్లో ఉద్యోగిగా పనిచేస్తూనే ఈ డ్రగ్స్ సరఫరా బాగోతం నడుపుతున్నట్లు చెబుతున్నారు.

హోటల్స్, మాల్స్, స్కూల్స్.. ఇలా చాలా చోట్ల విచ్చలవిడిగా వారు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో వీరిపై దాడి చేసిన పోలీసులు.. భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ కార్యాలయంలో ప్రస్తుతం వీరిని విచారిస్తున్న పోలీసులు.. ఎవరెవరితో వీరికి సంబంధాలు ఉన్నాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పట్టుబడిన ఇద్దరిని ఢిల్లీకి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం.
మరోవైపు నిందితుడు ఉంటున్న అపార్ట్‌మెంటు వాసులు దీని పట్ల భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అపార్ట్ మెంటులోనే ఉంటున్నప్పటికీ.. తమకీ విషయం తెలియదని చెబుతున్నారు. ఎవరి పనుల్లో వారు ఉంటారని, ఇలాంటి విషయాలను గమనించే అవకాశం లేదని అంటున్నారు. దీనిపై ఆదివారం ఉదయం అపార్ట్ మెంటు వాసులతో మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications