పూజ పేరుతో ఎక్కడెక్కడో తాకి!: మగ సంతానం కోసం వెళ్తే.., హైదరాబాద్‌లో మరో నకిలీ బాబా
పూజల పేరిట లైంగిక వేధింపులకు పాల్పడటమే గాక.. ఎదురుతిరిగిన వారిని చంపేస్తానని బెదిరిస్తూ వస్తున్నాడు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మన్నార్ బాబా అనే మరో నకిలీ బాబా గుట్టు రట్టయింది. మగ సంతానం కలిగేలా చేస్తానని అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. పూజల పేరిట లైంగిక వేధింపులకు పాల్పడటమే గాక.. ఎదురుతిరిగిన వారిని చంపేస్తానని బెదిరిస్తూ వస్తున్నాడు.
బాబా అరాచకాలపై ఓ మహిళ వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేయడంతో అతని లీలలు బయటపడ్డాయి. టోలీచౌకికి చెందిన ఆ మహిళ మగ సంతానం కోసం బాబాను సంప్రదించగా.. పూజ పేరుతో ఆమె జననాంగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేంటని ప్రశ్నిస్తే.. బయట ఎవరికైనా చెబితే నీ పిల్లలను చంపేస్తానంటూ బెదిరించాడు.

భూత వైద్యం పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న ఈ బాబాకు పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. బాధితురాలి ఫిర్యాదుతో పథకం ప్రకారం అతన్ని పట్టుకున్నారు. ఎంతోమంది మహిళలు ఇతని ఉచ్చులో చిక్కుకుని మోసపోయినట్లు గుర్తించారు.
కాగా, టోలీచౌకి ప్రాంతానికి చెందిన బాధితురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మగ సంతానం కోసం భర్త ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. దీంతో తెలిసినవారి సూచనతో ఆమె మన్నార్ బాబాను సంప్రదించింది. నీ శరీరంలో సైతాన్ ఉందని, మగ సంతానం కలగాలంటే అన్నదానం చేయాలని నమ్మించాడు.
ఇందుకోసం పలు దఫాలుగా రూ.4లక్షలు గుంజాడు. ఇంకా డబ్బు కావాలని వేధించాడు. లైంగికంగాను వేధింపులు ఎక్కువవుతుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో మన్నార్ బాబా గుట్టు రట్టయింది. ఈ బాబా హర్యానా నుంచి హైదరాబాద్ వచ్చి మదర్సా స్థాపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న అతని నుంచి పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications