మొగున్ని అతని ప్రియురాలిని కెమెరాల ముందు చితక్కొట్టిన మరో భార్యా.. అక్రమ సంబంధాల ఎఫెక్ట్!!(వీడియో)

Recommended Video

    హైదరాబాద్‌లో కెమెరాల ముందు మొగుణ్ణి చితక్కొటిన మరో మహిళ!! (వీడియో)

    హైదరాబాద్ : కలకాలం తోడుంటానని చెప్పిన భర్త మాట తప్పాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య గుండె పగిలిపోయింది. ఆమె చూస్తూ ఊరుకోలేదు. కాళికాదేవి అవతారం ఎత్తింది. తన పతీపై శివాలెత్తింది. తాను, కూతురి పరిస్థితి ఏంటీ అని కాలర్ పట్టుకొని అడిగింది. మొన్న ప్రగతినగర్ ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో ఘటన జరిగింది. తన భర్త మరో మహిళతో కులుకుతున్న సంగతిని కెమెరా సాక్షిగా బట్టబయలు చేసింది.

    వివాహేతర సంబంధం ..

    వివాహేతర సంబంధం ..

    ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న అతని పేరు సుధాకర్. ఇతనికి నాలుగేళ్ల క్రితం లావణ్యతో వివాహమైంది. వీరికి కాపురానికి సాక్షిగా ఓ పాప కూడా ఉంది. అయితే సుధాకర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సహజీవనం చేస్తూ కుమారుడిని కూడా కన్నాడు. తన వద్దకు రాకుండా భర్త ఏం చేస్తున్నాడని లావణ్య ఆరాతీసింది. అయితే గుండెలు పగిలే నిజం వెలుగుచూసింది. తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తెలిసింది. వారికి కొడుకు కూడా పుట్టాడని తెలిసి షాక్ తిన్నది. వెంటనే హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నడో బంధువుల ద్వారా కనుగొన్నది. చింతల్ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని .. వారి భండారాన్ని కెమెరా సాక్షిగా బయటపెట్టింది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె బంధువులైతే సుధాకర్‌పై దాడి కూడా చేశారు. తర్వాత సుధాకర్ వ్యవహరంపై జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    రూ.40 లక్షల కట్నం

    రూ.40 లక్షల కట్నం

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారెపాకకు చెందిన లావణ్యకు కృష్ణ జిల్లా నరసరావు పాలెనికి చెందిన సుధాకర్‌తో 2015లో పెళ్లైంది. పెళ్లి సమయంలోనే అతనికి రూ.40 లక్షల కట్నం కూడా ఇచ్చారు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. సుధాకర్, లావణ్య ఇద్దరూ విజయనగరం జిల్లాలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో చిన్నారి అనే మహిళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడే నిలదీయగా విజయనగరం నుంచి పారిపోయి వచ్చాడు. అప్పటినుంచి హైదరాబాద్ చింతల్‌లో చిన్నారితో కలిసి ఉంటున్నాడు. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. తన వద్దకు ఎంతకు రాకపోవడంతో లావణ్యకు అనుమానం వచ్చింది. హైదరాబాద్‌లో ఆరాతీసింది. తన బంధువుల సహకారంతో చింతల్‌లో ఉంటున్నట్టు గుర్తించింది. వెంటనే అక్కడికొచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

    పేరు మార్చుకొని

    పేరు మార్చుకొని

    భార్య నుంచి వచ్చిన సుధాకర్ కాస్త తెలివిగా వ్యవహరించాడు. చింతల్‌లో ఉంటూ తనపేరును మార్చుకున్నాడు. సుధాకర్ కాస్త సిద్దూగా మారిపోయాడు. అంతేకాదు స్నేహితులు, బంధువులతో టచ్‌లో లేడు. కానీ చివరికి లావణ్య తన బంధువులతో సమాచారం అందుకొని దాడిచేసింది. తన భర్తను దూరం చేశావని చిన్నారిపై కూడా మండిపడ్డారు. వీరిద్దరిపై జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+