Anuradha: నెలకు రూ.లక్ష జీతం.. రూ. 60 వేల కిరాయి.. అయినా పక్కదారి.. ఎవరీ అనురాధ..!

హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ దందాకు సంబంధించి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ సనికొమ్ము ప్రభాకర్ రెడ్డితో పాటు అనురాధ అనే మహిళను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అయితే వీరితోపాటు పల్లెటూరు పుల్లట్లు టిఫిన్ సెంటర్ నిర్వాహుకుడు శివసాయి కుమార్ ను కూడా ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఈ ముగ్గురిలో అనురాధ కీలక సూత్రధారిగా ఉన్నారు. ఈమె డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. అస్సలు ఎవరీ అనురాధ..! ఈమె డ్రగ్స్ ఉచ్చులో ఎలా చిక్కుకుంది.

కరీంనగర్ జిల్లా గన్నేరుగూడకు చెందిన అనురాధ ఎంబీఏ పూర్తి చేసింది. ఆమెకు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె హైదరాబాద్ కు వచ్చింది. నానక్‌‌‌‌రాంగూడ టీఎన్‌‌‌‌జీవోస్ కాలనీలో ఉంటూ ఉద్యోగం చేస్తుండేది. భారీగా జీతం, సొంతూరి నుంచి వచ్చే రూ.60 వేల షాపుల కిరాయి, తండ్రి పెన్షన్‌‌‌‌ రూ.20 వేలు కూడా వచ్చేది. మొత్తం ఆమెకు నెలకు రూ.2 లక్షల వరకు వచ్చేవి. ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకుంది.

Anuradha went to jail even though he had a soft job and a salary of lakhs of rupees

ఆ తర్వాత వీకెండ్‌‌‌‌ పార్టీలు, పబ్స్‌‌‌‌, గోవా టూర్స్‌‌‌‌కి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే ఆమె చెడు వ్యసనాలు, తాగుడు, సిగరేట్లు, డ్రగ్స్‌‌‌‌కు బానిసయ్యింది. అనురాధ డ్రగ్స్ కోసం తరుచుగా గోవా వెళ్లేది. అక్కడ ఉన్న నైజీరయన్ డ్రగ్స్ పెడ్లర్ జేమ్స్ వద్ద అనురాధ కొకైన్, ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చేది. డ్రగ్స్ ను గచ్చిబౌలి, కూకట్ పల్లి, బంజారాహిల్స్, ఇతర ప్రాంతాల్లో ఉన్న కస్టమర్లకు అమ్మేది. ఆ సొమ్ముతో డ్రగ్స్ తీసుకోవడం, మందు తాగడం, జల్సాలు చేసేది. ఈ క్రమంలోనే అనురాధకు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.

అయితే అప్పటికే అతను డ్రగ్స్ తీసుకుంటూ ఉండేవాడు.. అనురాధ పరిచయంతో అతడికి డ్రగ్స్ మరింత ఇజీగా దొరికేవి. అతను అనురాధ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కూడా ఏర్పడింది. దీంతో వారు హోటళ్లలో గది తీసుకుని డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తుండేవాళ్లు. ఆ తర్వాత వీరికి పల్లెటూరు పుల్లట్లు టిఫిన్ సెంటర్ వెంకటశివ సాయి కుమార్ పరిచయం అయ్యాడు. అతని కూడా వీరు డ్రగ్స్ అలవాటు చేశారు. ప్రభాకర్ రెడ్డి, సాయి కుమార్ కు అనురాధ గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సప్లై చేసేది.

Anuradha went to jail even though he had a soft job and a salary of lakhs of rupees

అనురాధ ఇలా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. అనురాధ విషయంలో పెద్దలు జోక్యం చేసుకోకపోవడం. ఆమెకు తప్పేదో ఒప్పేదో చెప్పవారు లేకపోవడం. చెడు అలవాట్లక బానిస అవ్వడంతో ఆమె జీవితం మారిపోయింది. ఆమె పక్కదారి పట్టడానికి వచ్చే డబ్బు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+