నా ఫ్రెండ్‌తోనూ చాటింగ్, తాగిన మైకంలో అనూషను చంపేశా: మోతీలాల్
Recommended Video

హైదరాబాద్: అనూషపై అనుమానంతోనే తాను ఆమెను చంపేసినట్లు మోతీలాల్ చెప్పాడు. అనూష తాను 2013 నుంచి ప్రేమించుకుంటున్నట్లు అతను తెలిపాడు. బిటెకి గ్రాడ్యుయేట్ అనూష హత్య కేసులో ఆమె ప్రియుడు మోతీలాల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తమ ప్రేమను తమ ఇంట్లో అంగీకరించకపోయినా అనూష ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నామని అతను చెప్పాడు. అనూష చదువు ఖర్చులు కూడా తానే భరించానని చెప్పాడు.

ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది...
గత కొద్ది రోజుల్లో అనూష ప్రవర్తనలో మార్పు వచ్చిందని మోతీలాల్ చెప్పాడు. అనూష ఫోన్ పరిశీలిస్తే చాలా మందితో చాటింగ్ చేసినట్లు బయటపడిందని, తన స్నేహితుడు కూడా ఆమెతో చాటింగ్ చేయడంతో తనకు అనుమానం పెరిగిందని అన్నాడు.

నిలదీయడంతో గొడవ
చాటింగ్ వ్యవహారంపై అనూషను నిలదీశానని, దాంతో తమ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మోతీలాల్ చెప్పాడు. తాగన మైకంలో క్షణికావేశంతో అనూషను బండరాయితో మోది చంపినట్లు తెలిపాడు.

అన్నదమ్ముళ్ల ప్రమేయం ఉంది...
అనూష కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ డిసిపి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. అనూష హత్య కేసులో మోతీలాల్‌తో పాటు అతని అన్నదమ్ముళ్ల ప్రమేయం ఉందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఎస్ఐకి కూడా ప్రమేయం..
అనూష హత్యతో హైదరాబాదులోని మలక్‌పేట ఎస్ఐ రామ్‌లాల్‌కు కూడా ప్రమేయం ఉందని అనూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనతో పాటు చిన్న, శంకర్‌లను కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనూష గర్భవతి అవునా, కాదా అనే విషయం రీపోస్టుమార్టం చేస్తే బయటపడుతుందని వారన్నారు.












Click it and Unblock the Notifications