హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రేటర్‌ ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు: ప్రచార షెడ్యూల్ ఖరారు, ఇదే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తారని తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ప్రచార తేదీలను షెడ్యూల్ ఖరారైంది.

మూడు రోజుల పాటు ఆయన గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 28 29 30 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే రోడ్ షోలలో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేయనున్నారు. గ్రేటర్ పీఠానికి ఫిబ్రవరీ 2వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.

Ap CM Chandrababu Naidu Campaign For GHMC Elections

అంతకుముందు ఈనెల 12న నిజాం కాలేజీలో జరిగే భారీ బహిరంగసభలో చంద్రబాబు పాల్గొననున్నారు. టీటీడీపీ నేతలతోపాటు మిత్రపక్షమైన బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో నగరంలోని 150 మున్సిపల్ డివిజన్లు వార్డుల నుంచి బహిరంగసభకు జనసమీకరణ చేయాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ప్రచారానికి టీటీడీపీ నేతలు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం కొంత వరకైనా టీడీపీ-బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu Campaign For GHMC Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X