Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స‌మాజంలో అంద‌రూ స‌మానులే.. స‌మ‌తా మూర్తి భావితరాలకు స్ఫూర్తి : సీఎం జగన్

సమాజంలో అందరూ సమానులే అని చెప్పిన రామానుజా చార్యులు గొప్పవారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి . అసమానతలను తొలగించేందుకు కృషి చేశారని చెప్పారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారనన్నారు. సమతా మూర్తి స్పూర్తిని తెలియజేస్తూ.. ఇలాంటి గొప్పకార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌ స్వామికి అభినందనలు తెలిపారు. రామానుజ స్వామి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని జగన్ ఆకాంక్షించారు.

 రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం జగన్

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సీఎం జగన్

హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో సమతా మూర్తి మండపానికి వచ్చారు. చిన్న జీయర్ స్వామి సమక్షంలో సమతామూర్తి రామానుజా చార్యులను దర్శించుకున్నారు. విగ్రహ విశేషాలను చినజీయర్‌ స్వామి, ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని వీక్షించారు.

 సమతామూర్తి భావితరాలకు స్ఫూర్తి

సమతామూర్తి భావితరాలకు స్ఫూర్తి

సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. సమాజంలో అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకే సమతామూర్తి స్థాపన జరిగిందని అన్నారు. సమతామూర్తి రామానుజా చార్యులు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. అంత‌టి గొప్ప వ్య‌క్తి కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌న్నారు. అనంతరం సీఎం జగన్ కు చిన్నారులు ప్రజ్ఞా పుస్తకాలను బహూకరించారు

 ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూడాలి

ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూడాలి

దేశంలో ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూడాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. అన్ని వర్గాలు క్షేమంగా ఉండాలని అన్నారు. సమానత కోసం ఎంతో మంది మహానీయులు పోరాడారని పేర్కొన్నారు. నల్ల, తెల్ల జాతీయుల మధ్య అంతరాలను తొలగించేందుక అబ్రహం లింకన్ కృషి చేశారని చెప్పారు. సమాతా మూర్తి కేంద్రంలో లింకన్, లూథర్ కింగ్, మండేలా తదితరుల 150 మంది చిత్రాలను హాల్ ఆఫ్ ఫ్రేమ్‌గా రూపొందించినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. సమతా స్పూర్పిని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+