సీక్రెట్ కాపీ!: 'ఏపీ చోరీపై సమాధానం చెప్పలేకపోయిన తెలంగాణ'

విజయవాడ/హైదరాబాద్: తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఏపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆరోపించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయిందా, సమాధానం చెప్పలేకపోయిందా? అంటే అవుననే అంటున్నారు ఏపీ నేతలు.

'ఆ సీక్రెట్ మీకెలా తెలిసింది, హ్యాక్ చేశారా, నవ్వులపాలైన కేటీఆర్'

శుక్రవారం నాడు ఏపీ ప్రణాళికా మండలి చైర్మన్ కుటుంబ రావు విలేకరులతో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను తాము కాపీ కొట్టామన్న తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. దీనిపై డీఐపీబీ అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు.

AP counter to Telangana on copyright material on Ease of Doing Business

కాగా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌(ఈవోడీబీ) ర్యాంకు వ్యవహారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సరికొత్త వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్‌లైన్ అప్లికేషన్లను నిస్సిగ్గుగా చోరీ చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.

ప్రతి సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇందులో ఎవరికి మంచి ర్యాంక్ వస్తే ఆ రాష్ట్రంలో పరిశ్రమలు, ఇతర రంగాలకు చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నట్లుగా భావిస్తారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా కంపెనీలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నట్లుగా పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తాయి.

కేసీఆర్Xబాబు: కేంద్రం వద్ద 'సీక్రెట్', అది మిలియన్ డాలర్ల ప్రశ్న

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పరిశ్రమల శాఖ ఈవోడీబీ కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ ఆప్లికేషన్లను రూపొందించింది. పరిశ్రమలకు అనుమతుల జారీతోపాటు రెడ్ టేపిజం (జాప్యం) తగ్గించేందుకు ఈవోడీబీ ర్యాంకులు ఎంతో ఉపయోగపడతాయి. అంతర్గత విధానాలను సరళీకరించడమే దీని ఉద్దేశం. కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ అధికారులు రూపొందించిన ఆన్‌లైన్ ఆప్లికేషన్‌ను యథాతథంగా చోరీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.

దీనిపై ఏపీ కూడా కౌంటర్ ఇచ్చింది. విజయవాడ: తెలంగాణ వెబ్ పోర్టల్, ఏపీ వెబ్ పోర్టల్ రెండూ వేర్వేరని, సర్వర్‌ను కాపీ చేయడం ఎలా సాధ్యమని ఏపీ ఏపీ చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తమ పోర్టల్‌లో ఇప్పటి వరకు తొమ్మిది వేల లావాదేవీలు జరిపామమన్నారు.

ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మరో రాష్ట్రంపై ఫిర్యాదు చేయలేదని, చవకబారు ఆరోపణలపై దృష్టి సారించబోమన్నారు. ఏపీ అప్ లోడ్ చేసిన సమాచారం తెలంగాణకు ఎలా తెలిసిందని, వెబ్ పోర్టల్‌లో సమాచారం రహస్యంగా ఉంటుందని, మా వెబ్ పోర్టల్‌ను మీరు హ్యాక్ చేశారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+