పెళ్లికి రండి: ఏపీ మంత్రి అఖిలప్రియకు కేటీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ గురువారం కలిశారు. తనకు కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి ఆమె కేటీఆర్‌ వద్దకు వెళ్లారు.

AP minister akhila priya meets KTR

ఆగస్టు 29న జరగబోయే తమ వివాహానికి రావాలని కేటీఆర్‌ను వారిద్దరూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాబోయే దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా వారికి జ్ఞాపికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోను కేటీఆర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

మే 12న అఖిలప్రియ నిశ్చితార్థం పారిశ్రామికవేత్త భార్గవ్‌తో హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అఖిలప్రియ తల్లి, దివంగత భూమా శోభా నాగిరెడ్డి 2009-2014 మధ్య ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తన సహచర సభ్యురాలని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+