మాకు సేవలు: తెలుగు విశ్వవిద్యాలయంపై ఏపీ, ఓపెన్ స్కూల్ సొసైటీ ఖాతాకు ఓకే
హైదరాబాద్: ఏపీలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపి వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ఉన్నత విద్యా శాఖ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
గతంలో మాదిరి ఏపీలోని క్యాంపస్‌లకు సేవలు కొనసాగించేలా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని ఏపీ ఉన్నత విద్యా శాఖ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాదులో ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఏపీలోని రాజమండ్రి, శ్రీశైలం, కూచిపుడిలలో క్యాంపస్‌లు ఉన్నాయన్నారు.

అయితే, తన సేవలను తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తూ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని ప్రేశాలకు జారీ చేసిన ప్రకటన, సేవలు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఖాతా నిర్వహణకు హైకోర్టు అనుమతి
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీకి చెందిన ఖాతా నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. ఖాతాలను స్తంభింప చేసే నాటికి ఉన్న సొమ్ము నిల్వలను అలాగే ఉంచాలని ఆదేశించింది. ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభన వ్యవహారంలో గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఈ వ్యాజ్యంలోను వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications