ఎక్కువ తీసుకుంటున్నారు, వారి లెక్కలో వేయండి: ఏపీ-తెలంగాణ పరస్పర ఫిర్యాదు
హైదరాబాద్: జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ నీరు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా నీటి పైన ఇరు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటోందని ఈ నెల 8న తెలంగాణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.
జూరాల, శ్రీశైలం నుంచి తెలంగాణ ఎక్కువ నీటిని తీసుకుని లెక్కల్లో చూపడం లేదని ఫిర్యాదు చేస్తూ బుధవారం ఏపీ.. కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. తీసుకొన్న నీటిని చూపడానికి వీలుగా రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరింది.

తెలంగాణ ఫిర్యాదు చేసి కొద్ది రోజులకే ఏపీ ఈ ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద సంయుక్త పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరగా, జూరాల వద్ద కూడా అలాగే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది.
తెలంగాణ ఎక్కువగా వాడుకొన్న నీటిని వారి వాటాలోనే వేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధి నిర్ణయించేవరకు రెండు రాష్ట్రాల అధికారులతో జూరాల, శ్రీశైలం వద్ద సంయుక్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరింది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications