మాకు న్యాయం ఏది: మోడీ ప్రభుత్వంపై ఏపీ, తెలంగాణ అసంతృప్తి
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలకు తగినంత న్యాయం జరగడం లేదని రెండు రాష్ట్రాల ఎంపీలు మంగళవారం నాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకసభలో రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చలో టిడిపి లోకసభాపక్ష నేత తోట నరసింహం మాట్లాడారు.
బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నా ఏపీకి మాత్రం తగినంత కేటాయింపులు లేవని పెదవి విరిచారు. ఈ బడ్జెట్లో తమకు సహాయ హస్తం అందలేదనే భావన ఏపీ ప్రజల్లో ఉందన్నారు. విభజన తర్వాత రాష్ట్రం అనూహ్య ఇబ్బందుల్లో చిక్కుకొందనీ, గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
వైసిపి ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా పెండింగులో ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు.

టిఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ... ఓ రైలుకు పేరు మార్చాలన్నా ఎంతో సమయం తీసుకొంటోందనీ, నిబంధనల్ని ఈ మేరకు మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఖాజీపేటలో రైలుపెట్టెల కర్మాగారాన్ని నెలకొల్పాలనీ, హైదరాబాద్ నుంచి అమరావతికి ఫాస్ట్ ట్రాక్ రైలును ప్రవేశపెట్టాలనీ కోరారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర న్యాయశాఖ మంత్రిని మంగళవారం డిమాండ్ చేశారు. లోకసభలో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications