అప్సరను దారుణంగా హత్య చేసి మ్యాన్ హోల్‌లో పడేశాడు: వీడు మామూలు పూజారి కాదు!
హైదరాబాద్: శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్సర అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయికృష్ణ ఆమెను దారుణంగా హత్య చేసి సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 3వ తేదీనే అప్సరను నిందితుడు హత్య చేసినట్లు గుర్తించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిందితుడు వెంకటసాయి సూర్య కృష్ణ పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి అప్సర అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని అప్సర అతనిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే, అప్పటికే వివాహితుడైన వెంకటసాయికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే అప్సరను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. ఆమెను వదిలించుకోవాలని చూశాడు వెంకటసాయి. అప్సరతో ఎప్పటికైనా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన వెంకటసాయి.. ఆమెను చంపేయాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీన మాట్లాడాలంటూ.. అప్సరను సరూర్‌నగర్ రమ్మని చెప్పాడు. దీంతో అతను చెప్పినట్లే అప్సర సరూర్‌నగర్ వెళ్లింది. అప్పటికే కారులో అక్కడికి చేరుకున్న వెంకటసాయి.. అప్సరను తీసుకుని శంషాబాద్ ప్రాంతానికి వెళతాడు. అక్కడే వీరిద్దరి మధ్య పెళ్లి గొడవ జరిగింది.
అప్పటికే ఆమెను చంపాలని నిర్ణయించుకున్న వెంకటసాయి.. అప్సర తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అప్సర మృతదేహాన్ని సరూర్‌నగర్ తీసుకొచ్చి.. తహశీల్దార్ ఆఫీసు వెనక భాగంలోనే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని మ్యాన్‌హోల్‌లో పడేసి పూడ్చివేశాడు. ఇక ఎలాంటి అనుమానం రాకుండా వెంకటసాయి.. అప్సర కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసలు.. దర్యాప్తు చేపట్టారు.
కాల్ డేటా, సీసీఫుటేజీల ఆధారంగా వెంకటసాయి.. అప్సరను హత్య చేసినట్లు నిర్ధరించుకున్నారు పోలీసులు. ఆ తర్వాత అతడ్ని అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు వెంకటసాయి తానే అప్సరను హత్య చేసినట్లు అంగీకరింాడు. అప్సరను పూడ్చిపెట్టిన మ్యాన్ హోల్ దగ్గరకు చేరుకుకున్న పోలీసులు.. శవాన్ని బయటికి తీసీ పోస్టుమార్టంకు తరలించారు.నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, వెంకటసాయి కృష్ణ.. అప్సరకు వరుసకు మేనమామే అని అందర్నీ నమ్మించడం గమనార్హం.












Click it and Unblock the Notifications