పాతబస్తీ బాలికతో వృద్ధ షేక్ కాంట్రాక్టు పెళ్లి (ఫొటో)

హైదరాబాద్: పాతబస్తీ చిన్నారులపై అరబ్ షేక్‌ల ఆగడాలు ఆగడం లేదు. మరో అరబ్బు షేక్ మైనర్ బాలికపై కన్నేసి కాంట్రాక్ట్ వివాహానికి సిద్ధపడ్డాడు. హైదరాబాదులోని ఓ పాతబస్తీ బాలికను కాంట్రాక్ట్‌పై పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

అమ్మాయిని సొంతం చేసుకునే సమయంలో పోలీసులు రంగంలోకి దిగి, బాలికను కాపాడారు.ఆ అరబ్ షేకును కటకటాల వెనక్కు పంపించారు. పాతబస్తీకి చెందిన 17 ఏళ్ల బాలికను ఒమన్ దేశానికి చెందిన కమీజ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు కాంట్రాక్టు వివాహం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశాడు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని శుక్రవారం నగరానికి వచ్చాడు.

హఫీజ్ బాబానగర్‌లో నిఖా చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఈ విషయాన్ని పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లిని అడ్డుకుని కమీజ్‌ను అరెస్ట్ చేశారు.

 Arab shaik arrested for marrying old city girl

అరబ్ షేక్‌తో పాటు ముగ్గురు బ్రోకర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి జరిపించిన కిషన్‌బాగ్‌లోని ఖాజీ మాత్రం పరారీలో ఉన్నాడు. బ్రోకర్లను నూర్జహాన్ బేగం (40), షఫీక్ మహ్మద్, అబ్దుల్లాలుగా గుర్తించారు. అమ్మాయి తల్లికి వారు 30 వేల రూపాయలు పెళ్లి ఖర్చుల కింద ఇప్పించారు. వారు కనీజ్ నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు.

పెళ్లి జరిగిన తర్వాత కనీజ్ బాలికను ఓ లాడ్జికి తీసుకుని వెళ్లి బలవంతంగా కాపురం చేయాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి, అతన్ని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+