గుండె జబ్బు.. డయాలసిస్ పేరిట వీసాలు: ఆపై భాగ్యనగరిలో పెండ్లి.. అరబ్ షేక్‌ల బాగోతం

నడవడం కాదు.. నిలబడే సత్తువ కూడా లేదు.. నడవడానికి వాకింగ్ స్టిక్ అవసరం.. ఒకడికేమో గుండెజబ్బు. పేస్‌మేకర్‌ అమర్చుకున్నాడు. మరొకడికేమో రెండు కిడ్నీలూ చెడిపోయాయి. 15 రోజులకు ఓసారి డయాలసిస్‌ చేయించుకుంటున

హైదరాబాద్: నడవడం కాదు.. నిలబడే సత్తువ కూడా లేదు.. నడవడానికి వాకింగ్ స్టిక్ అవసరం.. ఒకడికేమో గుండెజబ్బు. పేస్‌మేకర్‌ అమర్చుకున్నాడు. మరొకడికేమో రెండు కిడ్నీలూ చెడిపోయాయి. 15 రోజులకు ఓసారి డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. అయినా పెళ్లియావ. పదహారేళ్ల పడుచు పిల్ల కావాలనే ఆరాటం. 'ఆడ' తోడు కోసం నిండు ముదుసలి వయస్సులోనూ అరబ్‌ షేక్‌లు వెనుకాడటం లేదు.

రెండు రోజుల క్రితం అరెస్టు అయిన ఎనిమిది మంది షేక్‌లను విచారించగా విచారణలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు గుండెజబ్బుందని, హైదరాబాద్‌లో పేస్‌మేకర్‌ పరికరం తక్కువ ధరకే ఇస్తారని అక్కడి వైద్యనిపుణులతో సిఫారసు చేయించుకుని ఆ పత్రాల ద్వారా ఒమన్‌ నుంచి ఓ వృద్ధ షేక్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చాక బాలికను పెళ్లిచేసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాడు.

ఖతర్‌ నుంచి వచ్చిన మరో షేక్‌.. తనకు రెండు మూత్రపిండాలు చెడిపోయాయని, డయాలసిస్‌ చేయించుకోవడంతోపాటు సొంతంగా రక్తశుద్ధి చేసుకునేందుకు పరికరాలు కొనేందుకు వెళ్తున్నానని అక్కడి వైద్యనిపుణుల ధ్రువీకరణ పత్రాలను తెచ్చాడు. ఇక్కడికి వచ్చాక డయాలసిస్‌ మాట మర్చిపోయి ఖాజీ హబీబ్‌ అలీకి రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి పెళ్లికి సిద్ధమయ్యాడు.

ముసలితనంలో ఈ పెళ్లి యావ ఎందుకు? అని ప్రశ్నిస్తే ఓ షేక్‌ ఇచ్చిన సమాధానం పోలీసులనే నోరెళ్లబెట్టేలా చేసింది. ''కోట్ల డబ్బు ఉండగానే సరిపోదు. దాన్ని ఎంజాయ్‌ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మీవాళ్లు ఎప్పుడూ డబ్బు, పదవులు.. పేరుప్రతిష్ఠలని ఎగబడుతుంటారు. శృంగారాన్ని వదిలేస్తారు. మేం అలా కాదు.. మాకు కావాల్సింది సెక్స్‌. దానికోసం ఏదైనా చేస్తాం'' అని షేక్‌ చెప్పాడు. ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడ్డ అరబ్‌షేక్‌ల విచారణలో మరిన్ని విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. జైలుకు వెళ్లిన వారే కాక ఇంకా పాతబస్తీలో ఉన్న అరబ్‌ షేక్‌లతో పోలీసులు సమావేశమయ్యారు.

రఫియాపై ఇలా తెలంగాణ వక్ఫ్ బోర్డు నిషేధం

రఫియాపై ఇలా తెలంగాణ వక్ఫ్ బోర్డు నిషేధం

పాతబస్తీలో బాలికలు, యువతులకు అరబ్‌ షేక్‌లతో పెళ్లిళ్లు చేయిస్తూ రూ.లక్షలు దండుకుంటున్న ఖాజీలపై పీడీ చట్టం ప్రయోగించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అహ్మద్‌ అబ్దుల్లా అల్‌ రహబీ అనే ఒమన్‌ షేక్‌కు పదహారేళ్ల బాలిక రౌక్సర్‌తో పెళ్లిచేసిన ఖాజీ అబ్దుల్లా రాఫియా కోసం పోలీసు అధికారులు గాలిస్తున్నారు. అబ్దుల్లా రఫియా అనైతిక, అక్రమ పెళ్లిళ్లు జరిపిస్తున్నాడని కొద్దినెలల క్రితం తెలంగాణ వక్ఫ్‌ బోర్డు అధికారులు అతడిని పెళ్లిళ్లు చేసేందుకు అనర్హుడిగా ప్రకటించింది. వక్ఫ్‌బోర్డు ఇచ్చిన ఉత్తర్వులపై అబ్దులా న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు. యథావిధిగా పెళ్లిళ్లు చేస్తున్నాడు. అబ్దుల్లాతో పాటు మరికొందరు ఖాజీలు కూడా పారిపోయారని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేయడంతోపాటు పీడీ చట్టం ప్రయోగించనున్నామని వివరించారు.

రౌక్సర్‌ను రప్పించేందుకు విదేశాంగశాఖ చర్యలు

రౌక్సర్‌ను రప్పించేందుకు విదేశాంగశాఖ చర్యలు

అరబ్‌ దేశాల నుంచి కాంట్రాక్టు పెళ్లిళ్లు చేసుకునేందుకు వస్తున్న వారికి ఎవరు ఆశ్రయం ఇచ్చినా తమకు సమాచారం అందించాలని పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. వివరాలు ఇవ్వని పక్షంలో.. తాము స్వయంగా తనిఖీలు నిర్వహించినప్పుడు అక్రమాలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఒమన్‌ షేక్‌ను పెళ్లిచేసుకుని అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్న రౌక్సర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ చర్యలను ముమ్మరం చేసింది. ఆ శాఖ ప్రతినిధి శుక్రవారం మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను కలిశారు. రౌక్సర్‌ను పంపేందుకు సహకరిస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు.

ఒమన్, ఖతర్, సౌదీల నుంచి షేక్‌ల రాక ఇలా

ఒమన్, ఖతర్, సౌదీల నుంచి షేక్‌ల రాక ఇలా

కాంట్రాక్టు పెళ్లిళ్ల కోసం ఒమన్‌, ఖతర్‌, సౌదీ ప్రాంతాల షేక్‌లే ఎక్కువగా ఇక్కడకు వస్తున్నారు. వీరిలో ఆగర్భశ్రీమంతులే కాదు.. భిక్షాటన, కూలీ పనులతో పొట్టపోసుకునేవాళ్లూ ఉన్నారు. రెండో రకం వారు రూ.3 - 4 లక్షలు జమకాగానే మోజు తీర్చుకునేందుకు హైదరాబాద్‌వైపు చూస్తున్నారు. ఏటా ఇలా భాగ్యనగరానికి వచ్చే షేక్‌ల సంఖ్య 200 దాకా ఉంటుందనేది అంచనా. సౌదీ నుంచి ఇక్కడకు వచ్చేముందు దొంగపత్రాలు సిద్ధం చేసుకుంటారు. శరీరం రోగాల పుట్టగా ఉన్నా.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, పెళ్లికి అర్హుడని వైద్యుల నుంచి ధ్రువీకరణ పత్రాలు సంపాదిస్తారు. 14-17 ఏళ్ల లోపు బాలికలతోనే పెళ్లికి ఇష్టపడతారు.

వివాహానికి షేక్‌లు పెట్టే తొలి నిబంధన ఇదే! షేక్‌లకు తాము బసచేసే లాడ్జిలు, హోటళ్లే అత్తారిళ్లు. పెళ్లి తర్వాత మూడ్రోజులపాటు తమ వాంచ తీర్చుకునేందుకు బాలికలపై వికృతంగా ప్రవర్తిస్తారు. ఒక్కో షేక్‌ లైంగిక పటుత్వం కోసం 20 - 30 దాకా వయాగ్రా జెల్స్‌ తీసుకుంటాడు. ఒక్క వయాగ్రా.. ఐదారుగంటల పాటు పటుత్వం ఇస్తుంది'' అని పోలీసుల విచారణలో ఓ అరబ్‌షేక్‌ చెప్పినట్టు సమాచారం. అసహజ ప్రక్రియలతో శృంగారం చేయాలని బాలికలపై ఒత్తిడి చేస్తారని తెలుస్తోంది. మాట వినకపోతే తీవ్రంగా కొడతారని తమ పశువాంఛ తీర్చుకునేందుకు మత్తుమందునూ ఇస్తారని వారినీ లైంగికంగా సమాయత్తం చేసేందుకు బలవంతంగా వయాగ్రాను తినిపిస్తారని పోలీసుల విచారణలో తేలింది.

జాతీయ స్థాయిలో ఇలా చర్చనీయాంశం

జాతీయ స్థాయిలో ఇలా చర్చనీయాంశం

ఇటీవల నగర పోలీసులు అరబ్‌షేక్‌లు, ఖాజీలను అరెస్ట్‌ చేయటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికోసం నగరానికి వచ్చిన అరబ్‌షేక్‌లను టూరి్‌స్టలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సౌదీ ఎంబసీలోని కొందరు అధికారులు పోలీసు అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చినట్లు సమాచారం. పెళ్లికోసమంటూ సర్టిఫికెట్లతో వచ్చిన వీరిని పర్యాటకులుగా పేర్కొనటంపై ఓ పోలీసు ఉన్నతాధికారి వారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఎంబసీ ద్వారా షేక్‌లకు సాయపడుతున్న వారిపై కూడా పోలీసులు దృష్టిసారించారు. పెళ్లి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన మరో ఎనిమిది మంది ఒమన్‌ షేక్‌లు మకాం వేసిన లాడ్జిల ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+