Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాతబస్తీలో షేక్‌ల పెళ్లిళ్లు.. కఠిన వాస్తవాలు: ఈ ప్రశ్నలకు జవాబేది?..

సౌదీ నుంచి పెళ్లి కోసం పాతబస్తీలో అడుగుపెట్టే అరబ్ షేక్‌లు.. తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతారు.

హైదరాబాద్: గట్టిగా పదడుగులు వేస్తే ఆయాసపడే వయసు.. పక్కన మరో మనిషి లేకపోతే ఆ పదడుగులు వేయడం కూడా కష్టమే. జుట్టు నెరిసి.. నడుం వంగిపోయినా 'శృంగారం' మీద మాత్రం కోరిక చావలేదు.

జీవితంలో ఎంజాయ్ మెంట్ అనే పదానికి శృంగారంలోనే వారు అర్థం వెతుక్కుంటారు. ఒకరకంగా స్వర్గ సుఖాలకు ఇది మాత్రమే సమానమని భావిస్తారు. అందుకే.. దేశం దాటొచ్చి మరీ.. తమ వాంఛల్ని తీర్చుకునిపోతారు.

పాతబస్తీలో పట్టుబడ్డ అరబ్ షేక్ ల అంతరంగం ఇలాగే ఉంటుంది. బాలికల జీవితాన్ని నాశనం చేస్తున్నామనే పశ్చాత్తాపం వారిలో ఏ కోశానా కనిపించదు. వాళ్లకు కావాల్సింది 'శృంగారం'.. ఏజెంట్లకు కావాల్సింది డబ్బు.. ఇద్దరి గాలానికి బలయ్యేది పేద ముస్లిం కుటుంబాలే.

మైనర్స్ అయితే కమీషన్ ఎక్కువ:

మైనర్స్ అయితే కమీషన్ ఎక్కువ:

సౌదీ నుంచి పెళ్లి కోసం పాతబస్తీలో అడుగుపెట్టే అరబ్ షేక్‌లు.. తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతారు. మైనర్ బాలికలను తీసుకొస్తే కమీషన్ ఎక్కువ ముట్టజెప్పుతారు.మైనర్స్‌కు బయటి ప్రపంచం గురించి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి.. వాళ్లు ఎదురుతిరగరనే ఆలోచన కూడా ఇందుకు కారణం కావచ్చు.

అందుకే ఏజెంట్లు సైతం పాతబస్తీలో గల్లీ గల్లీ జల్లెడ పట్టి మరీ అందమైన మైనర్ బాలికల కోసం అన్వేషిస్తారు. సదరు బాలిక కుటుంబ నేపథ్యం పేదరికంతో కూడుకున్నదయితే.. డబ్బు ముందు పెట్టి డీల్ సెట్ చేస్తారు.

దాదాపు 3దశాబ్దాల నుంచి:

దాదాపు 3దశాబ్దాల నుంచి:

దాదాపు మూడు దశాబ్దాల క్రితం నుంచి పాతబస్తీలో కాంట్రాక్టు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కేవలం తమ కామవాంఛల్ని తీర్చుకోవడం కోసమే అరబ్ షేక్ లు నిఖా పేరుతో ఈ చర్యలకు పాల్పడుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటైన ఖాజీలు, వారి ఏజెంట్లు వీరికి సహకరిస్తూ వస్తున్నారు.

1991లో పాతబస్తీకి చెందిన అమీనా అనే 10 ఏళ్ల బాలికను ఓ అరబ్ షేక్‌ పెళ్లి పేరిట సౌదీకి తీసుకెళ్తుండగా.. బాలిక ఏడుస్తుండటాన్ని ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ హోస్టెస్‌ అమ్రితా గుర్తించారు. అక్కడి నుంచి ఈ కాంట్రాక్టు పెళ్లిళ్ల గుట్టు రట్టవడం మొదలైంది.

దయనీయంగా బాలికల పరిస్థితి:

దయనీయంగా బాలికల పరిస్థితి:

షేక్ ల కోసం పేద ముస్లిం బాలికలను తీసుకొచ్చే ఖాజీలు.. తమ ఇళ్లలోనే పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. పేరుకు పెళ్లే అయినా.. ఒకరకంగా ఇది బలవంతపు వ్యభిచారమే అనేవారు లేకపోలేదు.

షేక్‌లతో పెళ్లి తర్వాత బాలికల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దేశం కాని దేశంలో నా అనే వారులేక వారు తల్లడిల్లిపోతున్నారు. సౌదీలో షేక్ కుటుంబ సభ్యులు కూడా వీరిపై లైంగిక దాడులు చేస్తుండటంతో బాలికల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

ఇక కొంతమంది షేక్ లు నిఖా తర్వాత 2-3వారాలు తమ లైంగిక కోర్కెలు తీర్చుకుని.. ఆ తర్వాత ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. షేక్ ల శోభనం కోసం పాతబస్తీలో గెస్ట్ హౌజ్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ ప్రశ్నలకు జవాబేది?:

ఈ ప్రశ్నలకు జవాబేది?:

పెళ్లీడు రాని మైనర్ బాలికలకు నిఖా జరిపిస్తున్నా.. వారిని యథేచ్చగా సౌదీకి తరలిస్తున్నా.. ఇన్నాళ్లుగా ఈ వ్యవహారం బయటపడలేదంటే ఖాజీలకు మరెవరైనా సహకరిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మైనర్లకు మేజర్లుగా సర్టిఫికెట్ ఎక్కడినుంచి సంపాదిస్తున్నారు?.. పాతబస్తీలో పుట్టగొడుగుల్లా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన గెస్ట్ హౌజ్ లకు అనుమతి ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.

నిఖా సందర్భంగా వరుడి పేరు, అడ్రస్‌ పాస్‌పోర్టు తదితర వివరాలు రాసేటప్పుడు షేక్‌కు వివాహ అనుమతి ఉందా? అనేది ఏమాత్రం పరిశీలనలోకి తీసుకోవట్లేదు. మొత్తం మీద ఖాజీలు, షేక్ ల ఆగడాలు పేద ముస్లిం కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+