వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుందారా! తాతయ్యకు ముద్దెట్ల పెట్టాలో చెప్తావా: 'అర్జున్ రెడ్డి'పై వర్మకు విహెచ్

అర్జున్ రెడ్డి సినిమా వివాదం మళ్లీ రాజుకుంది. ఈ సినిమా పోస్టర్లపై తన చర్యలను విమర్శించడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీరును కాంగ్రెస్ నేత వి హనుమంత రావు తీవ్రంగా దుయ్యబట్టారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అర్జున్ రెడ్డి సినిమా వివాదం మళ్లీ రాజుకుంది. ఈ సినిమా పోస్టర్లపై తన చర్యలను విమర్శించడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీరును కాంగ్రెస్ నేత వి హనుమంత రావు తీవ్రంగా దుయ్యబట్టారు..

దుస్తులు చించేయండి, 'అర్జున్ రెడ్డి'పై ఈర్ష్య: వీహెచ్‌పై వర్మ వివాదాస్పదం దుస్తులు చించేయండి, 'అర్జున్ రెడ్డి'పై ఈర్ష్య: వీహెచ్‌పై వర్మ వివాదాస్పదం

అశ్లీల దృశ్యాల పోస్టర్లను బాహాటంగా ప్రదర్శించడమే కాకుండా దానిని సమర్థించడం ఏమిటని నిలదీశారు. ఎక్కడపడితే అక్కడ ముద్దులు పెట్టినట్లు పోస్టర్లు పెట్టి.. తాతయ్యా చిల్ అంటావా అని అర్జున్ రెడ్డి దర్శకుడిని నిలదీశారు.

Recommended Video

Pelli Choopulu Fame Vijay Devarakonda's Arjun Reddy Movie Trailer Out

మంచి చేయకున్నా పర్లేదు కానీ

నేను తాతయ్యాలాగే చెబుతున్నానని, సమాజానికి మంచి చేయకపోయినా చెడు చేయవద్దని వి హనుమంత రావు అన్నారు. వర్మకు సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. అలాంటి పోస్టర్లపై సెన్సార్ బోర్డు దృష్టి పెట్టాలన్నారు. నగరంలో ఎక్కడా అలాంటి పోస్టర్లు వేయకుండా సినిమా యూనిట్‌కు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

సిగ్గుందారా అంటూ

'సిగ్గున్నదారా బై... నువ్వసలు దర్శకునివేనా?... సమాజానికి ఇట్లాంటివి చెబుతావా? తాతయ్య మనవడి దగ్గరకు వెళ్లి, బాబూ ముద్దెట్ల బెడతవురా? అని నేర్చుకోవాలా? తాతయ్యకు తెలియదారా? బై... సినిమాలు అమ్ముకోవడమే లక్ష్యమా?' అని విహెచ్.. అర్జున్ రెడ్డి దర్శకుడిని నిలదీశారు.

ఇలాంటివి సమర్థిస్తావా

'సమాజం, విలువలు, సంస్కారం వంటివి లేవా? పనిలేక ఇలాంటివన్నీ చెబుతున్నవా? మంచి సినిమాలు తీసి సమాజ ఉన్నతికి పాటుపడాలి కానీ, ఇలాంటివి సమర్థిస్తవా?' అంటూ వర్మను విహెచ్ తీవ్రంగా మందలించారు.

గమ్మున కూచో

నీకు సినిమాలు తియ్యనికి చేతకాకపోతే గమ్మున కూర్చోవాలని వీహెచ్.. వర్మకు, అర్జున్ రెడ్డి దర్శకుడికి సూచించారు. పని లేక ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి

అలా చేయకపోతే విశృంఖల విధానాలకు చొరవచూపుతున్నారని, మన సమాజాన్ని మనమే బాగుచేసుకోవాలని విహెచ్ హితవు పలికారు. ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలన్నారు.

English summary
Congress Leader V Hanumantha Rao on Wednesday fired at Dirctor Ram Gopal Varma over tearing the kissing poster of Arjun Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X