వీహెచ్‌కు వర్మ కిస్: ఫేస్‌బుక్‌లో రచ్చ, ఫోటో మామూలుగా లేదు!..
నిన్నటిదాకా వీహెచ్ మీద ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ వర్మ.. ఉన్నట్లుండి రొమాంటిక్ అవతారం ఎత్తాడు.
హైదరాబాద్: వర్మ అభిమానంతో టార్గెట్ చేసినా.. అసూయతో టార్గెట్ చేసినా తట్టుకోవడం ఒకింత కష్టమే. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మీద ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ వర్మ.. ఉన్నట్లుండి రొమాంటిక్ అవతారం ఎత్తాడు.
వీహెచ్‌కు ముద్దిస్తున్న ఫోటో ఒకటి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. బహుశా ముద్దుతో మొదలైన వివాదానికి ముద్దుతోనే ముగింపు పలకాలన్నాడో మరేమో గానీ ఇలా వీహెచ్‌ను గాఢంగా చుంబిస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఫోటోపై కామెంట్స్ తో నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు.

అంతేకాదు, ఈ ఫోటోను ఇలా ఎడిట్ చేసి, వీహెచ్‌లో ఆ అప్పీల్ కనిపించడానికి 27మంది కంప్యూటర్ గ్రాఫిక్ నిపుణులు 6గంటల పాటు కష్టపడ్డారంటూ వర్మ పేర్కొనడం గమనార్హం.దీనిపై కొంతమంది వీహెచ్ ను సమర్థిస్తూ వర్మపై ఫైర్ అవుతుంటే, మరికొంతమంది వర్మకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఈ ఫోటో ఎక్కడిదో సరిగా గుర్తుపట్టారా?.. గతంలో అనురాగ్ కశ్యప్‌కు వర్మ ముద్దిచ్చిన ఫోటోనే ఇది. కాకపోతే కశ్యప్ స్థానంలో వీహెచ్ ను చేర్చి వర్మ అభిమానులు ఆయన ఖాతాలో వదిలారు. దాన్నే వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
కాగా, అర్జున్ రెడ్డి సినిమా 'లిప్ కిస్' పోస్టర్లను ఆర్టీసీ బస్సులపై అతికించడంతో వీహెచ్ వాటిని చించేయడం, ఆపై వీహెచ్ దుస్తులు చించాలంటూ వర్మ కామెంట్ చేయడం తెలిసిందే. అంతకుముందు 'తాతయ్య చిల్..' అంటూ విజయ్ దేవరకొండ వీహెచ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఇలా సినిమా పోస్టర్ల గురించి వర్మ-వీహెచ్ మధ్య సాగిన వివాదం మొత్తానికి సినిమాకు మాత్రం భలే హైప్ తీసుకొచ్చింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications