తల్లితో పరిచయం: కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఆర్మీ అధికారి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆర్మీ అధికారి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. షామీర్‌పేట్‌లోని డీఆర్‌డీవోలో పాలనాధికారిగా పనిచేస్తున్న రిషిశర్మ(44)కు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లికి చెందిన ఓ మహిళ(42)తో పరిచయం ఏర్పడింది.

rape

సదరు మహిళ భర్తతో విడిపోయి కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటోంది. గత జనవరిలో ఒకరోజు రాత్రి రిషిశర్మ ఆ మహిళ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆ మహిళ కుమార్తె(19) ఒక్కతే ఇంట్లో ఉంది. కాగా, రిషి.. ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి పలుసార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

కాగా, బాధిత యువతి గర్భం దాల్చింది. ఈ విషయం రిషిశర్మకు చెప్పడంతో గర్భం తీసేయొద్దని హెచ్చరించాడు. దీంతో సోమవారం రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రిషిని అరెస్టుచేసి కోర్టుకు తరలించారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A army officer raped a girl in rajendra nagar in Hyderabad.
Please Wait while comments are loading...