ఒంటరి జంటలే లక్ష్యం: యువతిపై అత్యాచారానికి యత్నించిన కీచక జవాన్ అరెస్ట్

హైదరాబాద్‌: ఒంటరిగా ఉన్న జంటపై దాడిచేసి.. యువతిపై అత్యాచార యత్నం చేసిన ఆర్మీ జవాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. 14రోజుల జైలు శిక్ష విధించారు. జులై 23న తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమ్మూగూడాలో ఇంటర్‌ చదువుతున్న ఓ యువతి మరో వ్యక్తితో ఉన్నప్పుడు బ్రిజేష్‌ కుమార్‌ అనే జవాన్‌ యువతిపై అత్యాచారయత్నం చేశాడు.

అడ్డువచ్చిన ఆ యువకుడిని చితబాదాడు. ఈ మేరకు కేసు విచారించిన పోలీసులు నిందుతుడని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నిందితుడు బ్రిజేష్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు సీపీ అంజన్‌ కుమార్‌.

Army sepoy attempted rape, jailed for 14days

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బ్రిజేష్‌ కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌ అత్యాచారయత్నం చేసినట్లు ఆధారాలు లభించడంతో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని.. దానిపై మరింతగా విచారించిస్తే ఆ కేసుతో కూడా ఇతనికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

గతంలో బ్రిజేష్‌ ఎక్కడెక్కడ పని చేశాడో, అతనికి నేర చరిత్ర ఏమైన ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అంజన్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. కాగా, నాలుగు నెలల క్రితం పదో తరగతి చదువుతున్న అమ్మాయిపై బ్రిజేష్ కుమార్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+