వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురువారం నుండి హోరెత్తనున్న మాయదారి మైసమ్మో పాట.!ఆషాడ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఈ నెల 30 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ నెల 30 వ తేదీన నిర్వహించనున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం గోల్కొండ కోట వద్ద స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

విశ్వవ్యాప్తం అవుతున్న బోనాలు,బతుకమ్మ ఉత్సవాలు.. గురువారం నుండే ఆషాడం బోనాలు

విశ్వవ్యాప్తం అవుతున్న బోనాలు,బతుకమ్మ ఉత్సవాలు.. గురువారం నుండే ఆషాడం బోనాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తలసాని గుర్తు చేశారు. తెలంగాణ పండుగలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది తెలంగాణ ప్రజలకెంతో గర్వకారణం అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.

గురువారం గోల్కొండ బోనాలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్న మంత్రి తలసాని..

గురువారం గోల్కొండ బోనాలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్న మంత్రి తలసాని..

ఈ నెల 30 వ తేదీన గోల్కొండ, జులై 17 న సికింద్రాబాద్, 24 న హైదరాబాద్ బోనాలు జరుగుతాయని అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలో ని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని మంత్రి అన్నారు. బోనాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోల్కొండ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మంత్రి తలసాని.

పహారా కాయనున్న నిఘా పోలీసులు.. అవాంఛనీయ సంఘటనలకు తావు లేదన్న తలసాని

పహారా కాయనున్న నిఘా పోలీసులు.. అవాంఛనీయ సంఘటనలకు తావు లేదన్న తలసాని

అదేవిధంగా మఫ్టీ పోలీసులు, షీ టీమ్ లను కూడా నియామిస్తున్నామని తలసాని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకేట్స్, 55 వేల వాటర్ బాటిల్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. అంతే కాకుండా నాలుగు అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని, 5 మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

భక్తులందరూ స్వేచ్చగా మొక్కులు చెల్లించుకోవాలి.. భద్రతకు పెద్ద పీఠవేసామన్న మంత్రి శ్రీనివాస యాదవ్..

భక్తులందరూ స్వేచ్చగా మొక్కులు చెల్లించుకోవాలి.. భద్రతకు పెద్ద పీఠవేసామన్న మంత్రి శ్రీనివాస యాదవ్..

సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసిపీ జోయల్ డేవిస్, ఏసీపి శివ మారుతి, ట్రాఫిక్ డీసీపి కరుణాకర్, ట్రాన్స్ కో సీజీఎం నరసింహ స్వామి, వాటర్ వర్క్స్ ఊఎన్సీ కృష్ణ, దేవాదాయ శాఖ డీసీ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఊవో శ్రీనివాస్ రాజు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్, పురావస్తు శాఖ అధికారి రోహిణి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ ఆండ్ బీ ఈసీ హఫీజ్, వాటర్ వర్క్స్ జీఎం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Talasani Srinivas Yadav, Minister of State for Animal Husbandry, Fisheries and Dairy Development and Cinematography, said the government would make large-scale arrangements for the Ashada Bonalu celebrations, which will begin from the 30th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X