పూరీకి చిన్నా డ్రగ్ కొరియరా?: సిట్ ప్రశ్నించింది పూరీతో సంబంధాలపైనే!
డ్రగ్స్ కేసు విచారణతో భాగంగా ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం ఉదయం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అలియాస్ ధర్మారావును విచారించనుంది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణతో భాగంగా ఎక్సైజ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం ఉదయం ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అలియాస్ ధర్మారావును విచారించింది. మంగళవారం ఉదయమే ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లారు. కాగా, అంతకుముందు కూడా మీడియా కంట పడకుండా మూడు వాహనాలు మారి సిట్ కార్యాలయానికి చిన్నా చేరుకోవడం గమనార్హం.
ఉదయం 10.30గంటల నుంచి సుమారు 4గంటలపాటు సిట్.. చిన్నాను విచారించింది. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు చిన్నా.. సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఎక్కువగా పూరీతో సంబంధాలపైనే ఆరా తీసినట్లు సమాచారం. డ్రగ్స్ వినియోగం తెలుసా? అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.
చిన్నాను డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఒక కొరియర్‌గా పూరి వాడుకున్నారని సిట్ అనుమానించింది. అనుమాన నివృత్తి కోసం చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పూరి జగన్నాథ్‌తో చిన్నాకు ఉన్న సంబంధాలు.. ఎంతకాలంగా వారి మధ్య పరిచయం ఉందనే విషయంపై ప్రశ్నించారు.
పూరి డ్రగ్స్ తీసుకునేవాడా? లేదంటే ఎవరికైనా డ్రగ్స్ ఇవ్వడం జరిగిందా? అనే విషయాలపై చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో స్మగ్లర్స్ పంపిస్తున్న డ్రగ్స్‌ని చిన్నా తీసుకుని వాటిని పూరి చెప్పిన వాళ్లకు అందజేశారని సిట్ అధికారులకు అనుమానాలున్నాయి. చిన్నా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని సమాచారం.
చిన్నాను సాక్షిగా మాత్రమే సిట్ పరిగణించినట్టు తెలుస్తోంది. అయితే, సిట్ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే చిన్నా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, ఇప్పటి వరకు విచారించిన వారిలో చిన్నానే తక్కువ సమయం విచారించడం గమనార్మం.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ కాల్ డేటాలో చిన్నా పేరు కూడా ఉండటంతో ఆయనకు నోటీసులు పంపారు ఎక్సైజ్ అధికారులు. కాగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గర 22 చిత్రాలకు పనిచేశారు చిన్నా. ఈ క్రమంలో కెల్విన్, పూరీలతో సంబంధాలపై సిట్.. చిన్నాను ప్రశ్నించనుంది.

సోమవారం సినీ నటుడు నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. ఆయన డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే నవదీప్‌తోపాటు ప్రముఖ సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌ను సిట్ విచారించింది. మొత్తం 12 మంది సినీ ముఖ్యులకు నోటీసులు పంపించిన సిట్.
సోమవారం నాటికి ఐదుగురి విచారణ పూర్తి చేయగా, మంగళవారం చిన్నాను విచారించనుంది. ఇప్పటి వరకు హాజరైన నటులు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో చిన్నా విచారణలో ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications