ఆలేరు ఎన్‌కౌంటర్‌పై అసద్, ఓ పార్టీ వల్లే: రాజాసింగ్
హైదరాబాద్: వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులోని జనగామ - ఆలేరు మధ్యలో జరిగిన వికారుద్దీన్ అండ్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్ పైన న్యాయవిచారణ జరిపించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం డిమాండ్ చేశారు.
వరంగల్ నుండి హైదరాబాదుకు తీసుకొస్తున్న ఐదుగురు విచారణ ఖైదీలను పోలీసులు మార్గమధ్యంలో కాల్చి చంపారని ఆరోపించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సూర్యాపేటలో పోలీసులను కాల్చి చంపినందుకు ప్రతీకారంగానే ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా ఉందన్నారు. పోలీసుల పైన కేసు నమోదు చేయాలన్నారు.

తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పార్టీలపై చర్యలేవి: రాజాసింగ్
హైదరాబాదులో ఓ రాజకీయ పార్టీ అండదండతో వేలాది మంది వికారుద్దీన్‌లు అక్రమంగా ఆశ్రయం పొందుతున్నారని, జాతి విద్రోహక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ ఆరోపించారు. కరడుగట్టిన తీవ్రవాది వికారుద్దీన్, అతని అనుచరులు పోలీసుల ఎన్ కౌంటర్లో మృతి చెందిన అనంతరం ఆయన మాట్లాడారు.
వికారుద్దీన్ ముఠా ఎట్టకేలకు ఎన్ కౌంటర్లో హతమవ్వడం ప్రజలు ఊహిరిపీల్చుకునే సందర్భమన్నారు. హైదరాబాదులో ఓ రాజకీయ పార్టీ ముసుగులో ఆశ్రయం పొందుతూ దేశభద్రతకే పెను సవాలుగా పరిణమిస్తున్నారని ఆోందళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఓఠు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గంను మచ్చిక చేసుకోవడం వల్లనే నగరంలో ఇలాంటి శక్తులు పుట్టుకు వస్తున్నాయన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications