పీఎస్‌లో మందేస్తూ చిక్కిన ఏఎస్ఐ, కానిస్టేబుల్
కరీంనగర్: జిల్లాలోని కొడిమ్యాల పోలీస్‌స్టేషన్ పైనగది(బ్యారక్)లో సోమవారం రాత్రి ఏఎస్సై వహీద్ పాషా మద్యం తాగుతూ జగిత్యాల రూరల్ సీఐ విజయ్ రాజుకు అడ్డంగా దొరికిపొయాడు. సోమవారం హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ బహిరంగ సభకు బందోబస్తు కోసం కొడిమ్యాల ఎస్సై నీలం రవి రెండు రోజుల కిందట వెళ్లాడు.
అప్పటినుంచి స్టేషన్ ఇన్‌చార్జిగా ఏఎస్సై వహీద్‌పాషా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి కానిస్టేబుల్ పెంటయ్యతో మద్యం తెప్పించుకుని స్టేషన్‌పైన ఉన్న గదిలో తాగుతుండగా, పక్కా సమాచారంతో సిఐ విజయ్‌రాజ్ వెళ్లడంతో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.
వైద్య పరీక్షలకు జగిత్యాలకు తీసుకెళ్తుండగా తనతోపాటు మరో ఏఎస్సై ఆంజనేయులు, కానిస్టేబుల్ పెంటయ్య మద్యం తాగారని సిఐకి ఏఎస్ఐ చెప్పాడు. దీంతో ముగ్గురినీ మల్యాల ఎస్సై శ్రీనివాస్‌తో వైద్యపరీక్షల కోసం వరంగల్‌కు పంపారు. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.

ఈత నేర్చుకోవడానికెళ్లి మృత్యువాత
వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కొత్తపల్లి వాగు సమీపంలో ఉన్న బావిలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన కాసాని విజయ్(14) అనే బాలుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు.
దగ్గరలో ఈత వచ్చిన వారు కూడా ఎవరూ లేకపోవడంతో విజయ్ నీటిలోనే ప్రాణాలు కోల్పోయాడు. విజయ్ తొమ్మిదో తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులకు విజయ్ ఒక్కడే కుమారుడు. దీంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. బావిలో నుంచి మృతదేహాన్ని గ్రామస్తులు బయటికి తీశారు.












Click it and Unblock the Notifications