లేడీ ఏఎస్పీతో సీఐ బాగోతం: నగరం వదలొద్దని సునీతకు ఆదేశాలు, నాయిని తీవ్ర ఆగ్రహం
Recommended Video

హైదరాబాద్: కట్టుకున్న భర్తను మోసం చేస్తూ ఓ సీఐతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏసీబీ ఏఎస్పీ సునీత రెడ్డిని సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆమెపై పలు ఆంక్షలు విధించారు. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి తన భార్య సునీతతో కల్వకుర్తి సీఐ మల్లికార్జున్ రెడ్డిని భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.
వారిద్దరి వ్యవహారాన్ని వీడియో సాక్ష్యాలతో సహా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇద్దరు ప్రవర్తించారని భావించిన అధికారులు వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా పేరిట జారీ అయింది.

మహిళా అధికారిణిపై ఆంక్షలు
ఈ ఉత్తర్వుల్లో సస్పెన్షన్ అమలులో ఉన్నంత కాలం ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్ నగరాన్ని వీడవద్దని ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. సీఐపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్‌లో ఆమె పేరు ఉండటం, ఆమె అనైతికంగా ప్రవర్తించిందన్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు.

నాయిని హెచ్చరిక
ఈ వ్యవహారంపై హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకే అధికారులిద్దరినీ సస్పెండ్ చేసిన విషయం గుర్తు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆ సీసీటీవీ పుటేజీ సేకరణ
సీఐపై నమోదైన కేసు దర్యాప్తును కేపీహెచ్‌బీ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో సాక్షులుగా ఉన్న ప్రమీల, సునంద, సురేశ్(సురేందర్ రెడ్డి స్నేహితుడు)తో పాటు, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వాంగ్మూలాలను నమోదు చేశారు.
ఏఎస్పీ ఫ్లాట్ లోపలికి సీఐ ప్రవేశిస్తున్న సమయంలో ఇద్దరూ లోపల ఉండగా ఆమె భర్త తలుపు తట్టి బయటికి రప్పించిన సందర్భంలో నమోదైన సీసీ పుటేజీ దృశ్యాలనూ సేకరించారు. వారిద్దరి మధ్య సాగిన వాట్సాప్ సంభాషణలు, కాల్‌డేటా వివరాలనూ సేకరిస్తున్నారు.

వేర్వేరుగా ఉత్తర్వులు జారీ
కాగా, ఏసీబీ ప్రధాన కార్యాలయం అదనపు ఎస్పీ, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సీఐలను సస్పెండ్ చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఇందు ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీలోని ఏఎస్పీ చెందిన ఫ్లాట్ నుంచి వస్తూ సీఐ ఆమె భర్త సురేందర్ రెడ్డికి పట్టుబడటం, ఈ సందర్భంగా ఆయన అమ్మతోపాటు అత్త, పెద్దత్త(ఏఎస్పీ అమ్మ, పెద్దమ్మ) ప్రమీల, సునందలు సీఐపై చెప్పులతో దాడిచేయడం చేసిన విషయం తెలిసిందే.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications