మోడలింగ్ కోరిక తీరలేదని ఆత్మహత్య, స్నేహితుడితో ముంబైకి సిద్ధం కాగా..
మోడలింగ్ కావాలనుకున్న ఓ యువతికి ఇంట్లో నుంచి వ్యతిరేకత ఎదురయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: మోడలింగ్ కావాలనుకున్న ఓ యువతికి ఇంట్లో నుంచి వ్యతిరేకత ఎదురయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇంట్లోని కొంత నగదు, బంగారం తీసుకుని ముంబయికి వెళ్లాలని యత్నించింది. ఆమె తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో కుంగిపోయి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది.
నజమ్ నగర్‌కు చెందిన ఇలియాస్ ప్రయివేటు ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. ఆయన కూతురు హజ్రా సుల్తానా (20) మోడలింగ్‌లో రాణించాలని కలలు గన్నది. ఇటీవల తరచూ బ్యూటీపార్లర్‌కు వెళ్లి మోడలింగ్‌కు సంబంధించి అనుకరణలు చేసేది.

ఆమె మోడలింగ్ పైన దృష్టి పెట్టడం ఇంట్లో వాళ్లకు నచ్చలేదు. దీంతో తల్లిదండ్రులు ఇర్షాద్ షేక్ అనే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిశ్చితార్థం చేశారు. హజ్రా సుల్తానా, ఇర్షాద్‌షేక్‌లు సెల్‌ఫోన్లో తరుచూ ట్లాడుకునేవారు.
ఇది ఇర్షాద్‌షేక్ తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో పెళ్లి రద్దయింది. దీంతో హజ్రా సుల్తానా ముంబైకి వెళ్లి మోడలింగ్‌లో స్థిరపడాలని భావించింది. తల్లిదండ్రులకు చెబితే వెళ్లనివ్వరని.. వారికి చెప్పకుండా ఇంట్లోని రెండు తులాల బంగారు నగలు, కొంత నగదు తీసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు ఈ నెల 5న రాత్రి చేరుకుంది.
అంతకుముందు అత్తాపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో మేకప్ చేయించుకుంది. కిషన్‌బాగ్ నజమ్‌నగర్‌లోని తన స్నేహితుడిని ముంబైకి వెళ్లి మోడలింగ్ చేయడానికి సహాయంగా వెంట రమ్మని కోరింది. రేపు వెళ్దామని అతను చెప్పాడు. ఆ రోజుకు తన సోదరి ఇంట్లో ఉంచాడు.
మరోవైపు, కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల 5న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇర్ఫాన్ తన సోదరి ఇంట్లో హజ్రా సుల్తానాను ఉంచానని బహదూర్‌పురా పోలీసులకు చెప్పాడు.
గురువారం ఉదయం హజ్రా సుల్తానాను, ఆమె తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం హజ్రా తల్లిదండ్రుల వెంట ఇంటికి వెళ్లింది.
ఓ వైపు, వివాహం రద్దు కావడం, మరోవైపు మోడలింగ్ కోరిక తీరలేదనే మానసిక ఆవేదనతో ఆమె శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహ్యతకు పాల్పడింది. పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications