కేసీఆర్ సీఎం కాకుంటే వేణు స్వామి దుకాణం బంద్..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్వం ముగిసింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69.09 శాతం పోలింగ్ నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. పోలింగ్ తక్కువ నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎవరు గెలిచిన పెద్దగా మెజార్టీ రాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అందరూ కూడా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణకు మరోసారి కేసీఆరే సీఎం అని గతంలో వేణు స్వామి తెలిపారు. పలు యూట్యూబ్ ఛానెల్స్‌తో మాట్లాడిన వేణు స్వామి ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమని..ఇందులో ఎటువంటి మార్పులేదని తెలిపారు.

 astrologer venu swamy facing crucial period in telangana election results

గతంలో వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టే జరగాయి. దీంతో తెలంగాణలో మరోసారి కేసీఆర్ అవుతారని భారీ ఎత్తున పందెలు కాసినట్టు సమాచారం. కాని ఎన్నికల సరళిని చూస్తే.. అధికార బీఆర్ఎస్ పార్టీకి పూర్తి విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా కేసీఆర్ పార్టీకి అనుకూలంగా చెప్పలేదు.

దాదాపు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. దీంతో అందరూ ఇప్పుడు వేణు స్వామిని టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామి జాతకానికి తెలంగాణ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలిచాయని కొందరు కామెంట్ చేస్తుంటే..వేణు స్వామి జాతకం ఈ దెబ్బతో తేలిపోనుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

 astrologer venu swamy facing crucial period in telangana election results

మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వేణు స్వామి జాతకాన్ని మార్చేలా ఉన్నాయి.మరీ వేణు స్యామి చెప్పినట్టు కేసీఆర్ మరోసారి సీఎం అవుతారో లేదో తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+