Bairi Naresh Video:పోలీసు వాహనంలో బైరి నరేష్..ఇదేం కుమ్ముడు భయ్యా..!
నాస్తికుడు బైరి నరేష్ పై మరోసారి స్థానికులు అయ్యప్ప భక్తులు దాడి చేశారు
హనుమకొండ: గతంలో అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలైన భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు బైరి నరేష్ మరో సారి వార్తల్లో నిలిచారు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన నరేష్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదని పేర్కొంటూ అతని పై అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర దాడి దిగారు. హనుమకొండ గోపాల్‌పూర్‌లో పోలీసు వాహనంలో వెళుతుండగా నరేష్ పై అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేశారు. పోలీసు వాహనంను ఆపి వాహనంలో ఉన్న నరేష్‌పై పిడిగుద్దులు గుద్దారు.బట్టలు విప్పి మరీ కొట్టారు. పోలీసులు అయ్యప్ప భక్తులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయ్యప్ప భక్తులతో పాటు కొందరు స్థానికులు కూడా దాడి నరేష్ పై దాడి చేశారు.

గతంలో అయ్యప్ప స్వామిపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు బైరి నరేష్. దీంతో అయ్యప్ప భక్తులు రాష్ట్రమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆందోళనలు నిర్వహించారు. ఆయనపై పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదు కావడంతో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ మధ్యకాలంలోనే బెయిలుపై విడుదలైన బైరి నరేష్ తిరిగి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
హన్మకొండ: అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి pic.twitter.com/Uq9u7O9jTr
— oneindiatelugu (@oneindiatelugu) February 27, 2023
తనపై దాడి జరగుతుందని ఎప్పుడో ఊహించినట్లు చెప్పుకొచ్చాడు బైరి నరేష్. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసు రక్షణ కల్పించాలని తాను కోరినట్లు వెల్లడించాడు. పోలీసు వాహనంలో ఉన్నప్పటికీ కూడా తనపై దాడి జరిగిందంటే భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పారు. తనకు గన్ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఇప్పటికైనా తనకు రక్షణ పెంచాలని ప్రభుత్వాన్ని బైరి నరేష్ వేడుకున్నాడు.












Click it and Unblock the Notifications