చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. కీలక ఆదేశాలు!
చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడైన రంగరాజన్ పైన ఈనెల 7వ తేదీన మూడు వాహనాలలో 25 మంది తన అనుచరులతో నల్లదుస్తుల్లో వచ్చి దాడి చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి చేస్తున్న ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. అసలు ఎవరు ఎందుకు రంగరాజన్ పైన దాడి చేశారు? దీని వెనుక ఎవరున్నారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
రంగరాజన్ పై దాడి ఘటన... స్పందించిన సీఎం రేవంత్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి ఘటన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన రంగరాజన్ కి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ ఘటన ఎలా జరిగింది అన్న దానిపైన సీఎం ఆరా తీశారు. అనంతరం దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

నిందితులపై కఠినంగా వ్యవహరిస్తాం
ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అయినా తాను చేస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి రంగరాజన్ ను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో వారు సీఎం రేవంత్ రెడ్డి తో రంగరాజన్ ను మాట్లాడించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాడికి పాల్పడిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
దాడులు చేయటం మంచిది కాదు: ఎమ్మెల్యే కాలే యాదయ్య
ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రంగరాజన్ గారి పైన దాడి చేయడం ప్రజాస్వామికమని ఇలా దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు. మరోవైపు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి ఘటన పైన ఇటు హిందూ సంఘాలు, అటు వివిధ రాజకీయ వర్గాలు ఘాటుగా స్పందిస్తున్నాయి.
రంగరాజన్ పై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్
దాడికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే రంగరాజన్ పై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దాడి ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.












Click it and Unblock the Notifications